»   » అదో సెక్స్ సీన్, వర్జిన్‌వా అంటే తెలీదని చెప్పా: షకీలా

అదో సెక్స్ సీన్, వర్జిన్‌వా అంటే తెలీదని చెప్పా: షకీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

షకీలా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రొమాంటిక్‌ టార్గెట్‌' సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. నరేశ్‌, శ్వేతా శైన్‌, శ్రీదేవి ప్రధాన తారాగణమైన ఈ చిత్రాన్ని సత్యం సినిమా క్రియేషన్స్‌ పతాకంపై మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడిన ఆమె సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు చెప్పుకొచ్చింది. మొదటిసారిగా ‘రొమాంటిక్‌ టార్గెట్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమా అందరూ చూడాలి. కానీ దాన్లో గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయొద్దు. నాలాగా గ్లామర్‌ పంచే ఇంకో షకీలా ఎక్కడో పుట్టే ఉంటుంది. ఆమె నటిస్తే అప్పుడొచ్చి చూడండి. కానీ నా ఫిల్మ్‌లో అంత గ్లామర్‌ ఉండదు. అది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు.

సెక్సీ ఇమేజ్‌ రావాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈ ఇమేజ్‌ వల్ల కేవలం మేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. బిగ్‌బాస్‌ అనే ప్రోగ్రామ్‌ చేశాను. దాంతో నాకు లేడీస్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా పెరిగిపోయారు. నేను నటించే ప్రతి సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల భార్యలందరూ నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటారు.

Director asked about my virginity: Shakeela

నేను సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగా జరిగింది. చెన్నైలో మా ఇంటికెదురుగా ఓ సినిమా కంపెనీ ఉండేది. అక్కడ ఉమాశంకర్‌ అనే మేకప్‌ మ్యాన్‌ ఉండేవారు. ఒకరోజు పదో తరగతి ఫెయిలయ్యానని నాన్న నన్ను బాగా కొట్టి ఇంటి బయటే నిలబెట్టారు. దాంతో చుట్కుపక్కల వాళ్లంతా పోగయ్యారు. ఉమాశంకర్‌ కూడా వచ్చారు. ‘ఎందుకండీ ఇంత పెద్ద పిల్లని కొడుతున్నార'ని నాన్నని ఆయన నిలదీశారు. ‘మా అమ్మాయి టెన్త్‌ ఫెయిలయిందండి. పదో తరగతి ఫెయిలైన అమ్మాయిని ఎవరు చేసుకుంటారో చెప్పండి' అన్నారు నాన్న. అప్పుడు నేను ‘చేసుకునే వాడు చేసుకుంటాడులే!' అని ఎదురు మాట్లాడాను. నాకు చదువు అబ్బలేదు. చదువు లేకపోతే పని దొరకదు. కాబట్టి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అనుకునేదాన్ని. అయితే ఉమాశంకర్‌ మా నాన్నకి నచ్చజెప్పి మరుసటిరోజు ఏవిఎమ్‌ స్టూడియోకు తీసుకెళ్లారు. డైరెక్టర్‌ నన్ను చూడగానే ఓకే చేశారు. సినిమా పేరు ‘ప్లే గర్ల్స్‌'. ఆ సినిమాలో సిల్క్‌స్మితకు చెల్లెలి పాత్ర పోషించాను. 25 రోజుల షూటింగ్‌కు 20 వేల రూపాయల పారితోషికం. అడ్వాన్స్‌గా నాన్నకు ఐదువేలిచ్చారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. అలా పదహారేళ్ల వయసులోనే తొలి సినిమా అవకాశం నన్ను వరించింది.

చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేదాన్ని. మొదటి సినిమా షూటింగ్‌ సమయంలో ఓ శృంగార సన్నివేశంలో నటించాల్సివచ్చింది. హీరోతో తప్పు చేసే సీన్‌ అది. కానీ నాకా వయసులో తప్పు చేయటమంటే ఏంటో తెలియదు. ఆ సీన్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలి. కాళ్లు కదిలించాలి. అలాంటి అనుభవం పొందిన వాళ్లకి ఆ సమయంలో ఎలా నటించాలో తెలిసేదేమో! నాకు అదంతా కొత్త. దాంతో డైరెక్టర్‌ ‘నువ్వు వర్జిన్‌వా?' అని నన్ను సూటిగా అడిగారు. ‘అంటే ఏంటి?' అన్నాను. వర్జిన్‌ అంటే అర్థం కూడా తెలియదు నాకు.

ఆ తర్వాత తమిళంలో చాలా అవకాశాలొచ్చాయి. సినిమాల్లో అడుగుపెట్టిన ఏడేళ్లకు నాన్న చనిపోయారు. అప్పుడే మలయాళంలో కూడా అవకాశాలు రావడం మొదలైంది. అప్పటిదాకా నాన్న మీద ఆధారపడ్డ నాకు స్వయంగా అన్నీ చూసుకోవడం ఇబ్బందైంది. పైగా భాష సమస్య. దాంతో వచ్చిన అవకాశాలన్నిటినీ వద్దని వెనక్కి పంపించేదాన్ని. అప్పుడు అమ్మ నువ్విలా అవకాశాలన్నీ వదిలేసుకుంటే ఎలా? నీ మీద ఆధారపడ్డ మేమేం తినాలి? అంది. దాంతో ఆ సినిమా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. ఆ సినిమా నచ్చకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒక ముప్పయ్యేళ్ల ఆవిడకి 17 ఏళ్ల అబ్బాయికీ మధ్య నడిచే రొమాంటిక్‌ స్టోరీ అది. అప్పుడు నా వయసు 20. నేను అంత పెద్దావిడగా నటించడమేంటని అనుకున్నాను. కానీ తర్వాత నా ఒంటి తీరు అలాగే ఉంది కదా అనిపించి ఒప్పుకున్నాను. ఆ తర్వాత మలయాళంలో వరుసగా అవకాశాలొచ్చాయని తెలిపారు.

English summary
Shakeela stunned all saying that the director of her first film asked her whether she was a virgin or not when she failed to act perfect an intimate scene. Shakeela said that at that time she questioned what the virginity was as she doesn't know the meaning.
Please Wait while comments are loading...