మళ్ళీ కాపీ కేసులో ఇరుక్కున్న దర్శకుడు!

ఇక ఇప్పడు వారు కోర్టుకెక్కుతామని ప్రియదర్శన్ కి నోటీస్ పంపారుట. దానికాయన స్పందిస్తూ సెటిల్ మెంటుకు తెరతీసారు. ఈ మధ్యనే ఆయన భాగమ్ భాగ్ సినిమాకూ ఈ తరహా కాపీ సమస్య ఎదుర్కొన్నారు.అలాగే ఈ సినిమా టైటిల్ కూడా తానే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజస్టర్ చేసుకోగా ప్రియదర్శన్ వాడేస్తున్నాడని షన్ముగం అనే తమిళ నిర్మాత గోల పెడుతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం ప్రియదర్శన్ తో చేతులు కలిపిన యు.టీవీ మోషన్ పిక్చర్స్ వారినీ వారు దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు సెటిల్ మెంట్ ఏ రీతిలో ముగియనుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఏదైమైనా 75 సినిమాలు ఇప్పటికి పూర్తి చేసిన ప్రియదర్శన్ కాస్త చూసి,రైట్స్ తీసుకుని కాపీ కొడితే బాగుంటుందని...తన శిష్యులకూ అదే నేర్పుతున్నాడని అని వారు విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











