»   »  పెద్దల వల్లే చిన్న చిత్రాలు ఛస్తున్నాయి

పెద్దల వల్లే చిన్న చిత్రాలు ఛస్తున్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasari Narayana Rao
చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దల వల్లే చిన్న సినిమాల మనుగడ కష్టమవుతోందని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 'బతుకమ్మ' శతదినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ''ప్రేక్షకాదరణ లేకున్నా థియేటర్లని తమ గుప్పిట్లో ఉంచుకొని వందాడాయని అసత్య ప్రచారంతో ప్రజల్ని మోసం చేస్తున్న వాల్లు 'బతుకమ్మ'ను చూసి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలంగాణా సంస్కృతిని, జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించార''న్నారు. చిత్ర బృందానికి జ్ఞాపికలందించారు. ఈ సినిమాకి టి.ప్రభాకర్‌ దర్శకుడు. పానుగోటి సరస్వతి రాంమోహన్‌రావు, మక్కపాటి వనజా చంద్రశేఖర్‌రావు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, కథానాయకుడు శ్రీహరి, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయితలు అందెశ్రీ, గోరటి వెంకన్న తదితరులు నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X