»   » దాసరి నారాయణరావు హెల్త్ బులిటెన్: డాక్టర్లు ఏమన్నారంటే...

దాసరి నారాయణరావు హెల్త్ బులిటెన్: డాక్టర్లు ఏమన్నారంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాసరి నారాయణ రావు అనారోగ్యంతో రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. దాసరి ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో వెంటిలెటర్ మీద ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వైద్యులు దాసరి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.

Dasari Narayana Rao

అన్నవాహిక ఇన్ఫెక్షన్ రావడంతో అది రప్చర్ అయిందని, దానికి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కిడ్నీ ఫెయిల్ వచ్చిందని, దానికి డయాలసిస్ చేసినట్లు వైద్యులు తెలిపారు. లంగ్స్ ఫెయిల్యూర్ కూడా రావడంతో వెంటిలెటర్ మీద చికిత్స చేసామని, ప్రస్తుతం లంగ్స్ బాగానే పని చేస్తున్నాయని తెలిపారు.

అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్ల ఇన్ ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఆయన బాగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

English summary
KIMS Hospitals management tuesday evening issued Dasari Narayana Rao health bulletin regarding his current status.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu