twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ నుంచి ఐదు కోట్లు తీసుకోవటం రూమరే

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ తో తను తెలుగులో ఓ చిత్రం చేయబోతున్నానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు దర్శకుడు హరి. తాను టాలీవుడ్‌లో అడుగుపెట్టడంలేదని అంటున్నాడు దర్శకుడు హరి. అలాగే జూ.ఎన్టీఆర్ నుంచి ఐదు కోట్లు ఈచిత్రం నిమిత్తం రెమ్యునేషన్ గా అందిందనేది కూడా రూమరే అని తెలిసిందే. 'అయ్యా', 'ఆరు', 'వేల్‌' తదితర చిత్రాలతో మాస్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సూర్యతో తెరకెక్కించిన 'సింగం', 'సింగం-2'లు తెలుగులోనూ ఘన విజయాల్ని నమోదు చేశాయి. నేరుగా తెలుగు చిత్రాన్ని తెరకెక్కించనున్నారన్న వార్తలు వినిపించాయి.

    హరి మాట్లాడుతూ..... 'సింగం-2' తర్వాత కార్తీతో సినిమా చేయాలని నిర్ణయించాను. కార్తీ మిగతా చిత్రాలతో తీరికలేకుండా ఉండటంతో ప్రస్తుతానికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కొత్త కథలు సిద్ధం చేసుకుంటున్నాను. నేను తెలుగు సినిమాకి మెగాఫోన్‌ పట్టుకోనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. కథ పూర్తయ్యాక అందుకు అనువైన హీరోని ఎంపిక చేసుకుంటానని తెలిపాడు.


    ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ సీన్ జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసాడట. ఈచిత్రం షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది. తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

    ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    Basking on the success of commercial hit Singam 2, there was a buzz that the director of the movie Hari will be directing a Telugu movie with Jr.NTR. Jr.NTR's Baadshaah was a resounding success commercially and the pair would have made a jumbo hit. However it has come to our knowledge that the source of information was a rumor and there is nothing on the cards of the director to film a Telugu movie. It was also rumored that he was given five crores for the project, but now it has turned out to be false news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X