»   » అబ్బబ్బే..నేను ఎన్టీఆర్ ని అసలు ఏమీ అనలేదు..డైరక్టర్ వివరణ

అబ్బబ్బే..నేను ఎన్టీఆర్ ని అసలు ఏమీ అనలేదు..డైరక్టర్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత నాలుగు రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ... దర్శకుడు హరి విషయంలో మండిపడుతున్నారు. అందుకు కారణం మీడియాలో వచ్చిన వార్తలు. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని హరి అన్నారని ఆ వార్తల సారాంశం. అయితే అందులో ఎంత వరకూ నిజముందే ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. హరి నిజంగా అలా అని ఉంటే...ఆ వీడియో వైరల్ అయ్యేది కదా అని ఆలోచించలేదు.ఇక ఈ విషయం దర్శకుడు హరి కి తెలిసింది.

హరి మీడియాతో మాట్లాడుతూ... "నా మీద ఓ రూమర్ రీసెంట్ గా విన్నాను. నేను ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నానని. అయితే నిజం ఏమిటంటే అసలు నేను ఎక్కడా ఆ మాట అనలేదు. ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్ నాకు నచ్చుతుంది. నేను టెంపర్ సినిమాని రెండు సార్లు చూసాను.

Director Hari Realizes His Mistake on NTR?

అలాగే...నేను ఎన్టీఆర్ తో పని చేయాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఎన్టీఆర్ కు కథ చెప్పటం జరిగింది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ఆశిస్తున్నాను అని ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.

'సింగం'(యముడు), 'సింగం 2′(సింగం - యముడు 2). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాయే 'సింగం 3'. తెలుగులో యముడు 3 పేరుతో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 16న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక టీజర్, పోస్టర్స్‌తో ఇప్పటికే అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తూ వెళుతోంది.

Director Hari Realizes His Mistake on NTR?

'సింగం 3' తమిళనాడు ఏరియా బిజినెస్ మొత్తం 42 కోట్ల రూపాయలు పలికిందట. సూర్య కెరీర్‍కు బిజినెస్ పరంగా అక్కడ ఇది అతిపెద్ద రికార్డు. ఇక ఒక్క తమిళనాడులోనే కాక, రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్సీస్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు.

English summary
It was merely a rumour that I said I didn't know NTR. I like his performance very much. I watched his 'Temper' twice and am eagerly waiting to work with the star. Long back, I narrated a story to NTR but it could not get materialized. I wish I would work with the star soon," clarifies Director Hari in his recent interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu