»   » కులం వివాదం కాబట్టే ఇన్నీ చెబుతున్నాను: డిజే వివాదంపై హరీష్ శంకర్

కులం వివాదం కాబట్టే ఇన్నీ చెబుతున్నాను: డిజే వివాదంపై హరీష్ శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిజె' సినిమా పాటపై కొందరు బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.

తొలుత ప్రవర చెప్పి ఈ వివాదంపై స్పందించారు హరీష్ శంకర్. ''16 అణాల వైదిక కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ అబ్బాయిని నేను. ఈ విషయం బ్రాహ్మణులందరికీ అర్ధం కావాలనే ప్రవర చెప్పాను. ప్రవర ఇపుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పాటలో ప్రవర అనే పదం కూడా వాడాము. ప్రవర అనేది రుషి వంశంలో పుట్టిన వారు తమను తాము పరిచయం చేసుకునేందుకు చెప్పేది.'' అని హరీష్ తెలిపారు.


ఆ లైన్ వివాదంపై

ఆ లైన్ వివాదంపై

ఇక్కడ అగ్రహారాల తమళపాకల్లె తాకుతోంది తమకం అనే లైను గురించి అభ్యంతరాలు చెప్పారు. ఒక అగ్రహారంలో ఉండే కుర్రాడు తన పరిధిలో ఉండే వస్తువులతో తన ప్రేమను కంపేర్ చేసుకుంటాడు. అందుకే అగ్రహారంలో ఉన్న తమళపాకు అంటాడే తప్ప పాకిస్థాన్లో ఉండే తమిళపాకు గురించో మామిడాకు గురించో మాట్లాడడు... అని హరీష్ శంకర్ తెలిపారు.


అవమానించినట్లు కాదు కదా

అవమానించినట్లు కాదు కదా

చాలా లవ్ స్టోరీస్ లో ఈ అమ్మాయిని చూసినప్పటి నుండి చదువు మీద ధ్యాస ఉండటం లేదు తనకు అని హీరో అంటాడు... అంత మాత్రాన సరస్వతీదేవిని అవమానించినట్లు కాదు. అతని పరిస్థితి చెప్పడంలో భాగంగా అగ్రహారంలోని తమళపాకు అన్నామే తప్ప అగ్రహారంలోని అమ్మాయి అనలేదు... అని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.


అందుకే తమిళపాకుతో పోల్చాం

అందుకే తమిళపాకుతో పోల్చాం

ఎందుకు అగ్రహారం తమళపాకు అన్నామంటే... అగ్రహారంలో ఉండే తమళపాకు అభిషేకాలకు, పూజలకు వాడతారు... పవిత్రంగా, కొత్తగా ఉంటుంది, వాడిన తమళపాకును మళ్లీ పూజకు వాడరు. ఈ ప్రేమ అనే ఫీలింగ్ కొత్తగా ఉంది అని చెప్పడంలో భాగంగా ఓ బ్రాహ్మణ కుర్రాడు అగ్రహారం తమిళపాకు అంటాడే తప్ప ఈ తమకం... చికెన్ ముక్కలా ఉందని అనడు... అనకూడదు. కేవలం లిరిక్ ను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎక్కడో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందనుకుంటున్నానే తప్ప మా మీద గానీ, మా సినిమా మీద గానీ కోపం ఉందని అనుకోవడం లేదు... అని హరీష్ శంకర్ అన్నారు.


బ్రాహ్మణిజం, హిందూ మతం మీద గౌరవం

బ్రాహ్మణిజం, హిందూ మతం మీద గౌరవం

నాకు ఏ సామాజిక వర్గం మీద కోపం లేదు. దిల్ రాజు గారు నిజామాబాద్ లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. సంవత్సరానికి 10 రోజులు బ్రహ్మోత్సవాల పేరు మీద కంప్లీట్ నాన్ వెజ్ మానేసి పట్టుబట్టలు కట్టుకుని ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు గుడిలోనే గడుపుతారు. ఒక్క బ్రాహ్మణిజం మీద మాత్రమే కాదు... హిందూ మతం మీద అంత గౌరవం ఉన్న నిర్మాత దిల్ రాజు... అని హరీష్ శంకర్ అన్నారు.


నేను గుడ్డు కూడా ముట్టలేదు

నేను గుడ్డు కూడా ముట్టలేదు

నేను వైదిక కుటుంబంలో పుట్టిన పదహారణాల బ్రాహ్మణుడిని. నేను ఇండస్ట్రీలో ఉన్నా నా జీవితంలో నాన్వేజ్ కాదు కదా కనీసం గుడ్డు ముట్టుకున్న పాపాన కూడా పోలేదు.... అని హరీష్ శంకర్ తెలిపారు.


కాస్ట్ బేస్డ్ మీద ఇష్యూ రేజ్ అయింది కాబట్టే

కాస్ట్ బేస్డ్ మీద ఇష్యూ రేజ్ అయింది కాబట్టే

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... కాస్ట్ బేస్డ్ మీద ఒక ఇష్యూ రేజ్ అవుతుంది కాబట్టి చెబుతున్నాను. ఒక 60 నుండి 70 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అంతా స్క్రిప్టు మీద కూర్చుని కేవలం ఒక సామాజిక వర్గాన్ని కించ పరుద్దామని సినిమాలు ఎవరూ తీయరు. నేనైతే అస్సలు తీయను.... అని హరీష్ శంకర్ అన్నారు.


విమర్శలు సహజమే

సాహిత్యం ఏదైనా కొందరు విమర్శిస్తారు, కొందరు ప్రశంసిస్తారు. నేను ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సినిమాలు తీస్తున్నాను. ఇపుడు ఫస్ట్ టైం నా సినిమాలో బ్రాహ్మిణ్ ను ఒక హీరోగా చూపిస్తున్నాం. కించ పరిచే విధంగా చూపించడం లేదు. హీరోయిజం అనేది బ్రాహ్మిణ్ క్యారెక్టర్ ద్వారా చూపిస్తున్నాను. బ్రాహ్మిణ్ యొక్క పొటెన్షియాలిటీని తెలియజేస్తూ ఉండే హీరో క్యారెక్టరైజేషన్ నా సినిమాలో ఉంది. దాన్ని పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... అని హరీష్ శంకర్ అన్నారు.


తప్పు చేసాననే భయం అస్సలు లేదు

తాను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నాన‌ని, ఈ సినిమా జూన్ 23న విడుద‌లవుతుందని.... అందుకే టీవీ చానల్ స్టూడియోలకు వచ్చి మాట్లాడలేక పోతున్నాను. అంత మాత్రాన తాను తప్పు చేసాననే భయంతో ఉన్నానని మాత్రం అనుకోవద్దు... అని హరీష్ శంకర్ అన్నారు.


సమయం వచ్చినపుడు చెబుతాం

సమయం వచ్చినపుడు చెబుతాం

ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక జోక్ రాసినా, ఒక డైలాగ్ రాసినా, ఒక పాట రాసినా పది మంది మెచ్చుకోవాలని రాస్తామే తప్ప... ఒకరిని కించ పరచాలనో, ఒకరిని బాధ పెట్టాలనో, రభస చేయాలనో రాయం. సమయం, సందర్భం వచ్చినపుడు నేను, మా లిరిక్ రైటర్ వచ్చి దీని అర్ధం ఏమిటో చెబుతామని హరీష్ శంకర్ అన్నారు.


చాలా మంది మెచ్చుకున్నారు

చాలా మంది మెచ్చుకున్నారు

తెలుగు పాటల్లో తెలుగుదనం లేదు, అన్నీ ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు వస్తున్నాయని చాలా మంది విమర్శిస్తుంటారు. యూట్యూబ్ లో ఈ పాటకు ఎక్కడలేని ప్రశంసలు వచ్చాయి. చాలా మంది బ్రాహ్మణులు ఆ పాట అద్భుతం అని రాసిన మెసేజ్‌లు సేవ్ చేసి పెట్టాను. లిరిక్స్ ఎక్స్‌ట్రార్డినరీ అనే ప్రశంసలు వచ్చాయి. సౌతిండియాలో 5 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది. ఎవరికీ నచ్చకుండా పాట ఇంత పెద్ద హిట్టవ్వదు. లిరిక్ లోని అర్ధాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్లే ఇలా అభ్యంతరం తెలుపుతున్నారు... సమయం, సందర్భం వచ్చినపుడు వారికి వివరణ ఇస్తాం అని హరీష్ శంకర్ స్పష్టం చేసారు.English summary
Responding on the controversy, director Harish Shankar told that he himself is a Brahmin and how could he make a film which insults Bhrahmin traditions ? He is assuring that the movie will be pride for Brahmin community.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu