30 weds 21: ఎవడు చూస్తాడు అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్.. వ్యూవ్స్ దెబ్బకు షాకింగ్ రియాక్షన్

ఈ మధ్య కాలంలో సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ద్వారా క్రేజ్ అందుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. కాన్సెప్ట్ క్లిక్కయితే ఈజీగా సినిమాల్ల్ ఛాన్సులు అందుకుంటున్నారు. అగ్ర దర్శకుల నుంచి కూడా వారికి సపోర్ట్ అందుతోంది. ఇక ప్రస్తుతం 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ కు మంచి క్రేజ్ అందుతోంది. సెన్సిటివ్ లైన్ తో మేకర్స్ క్రియేట్ చేసిన లవ్ మ్యాజిక్ బాగానే క్లిక్కయ్యింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరిస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జాస్మిన్ భాసిన్ మైండ్ బ్లోయింగ్ హాట్ స్టిల్స్

కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే

కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే

షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు రొటీన్ గా మారాయి. టైమ్ లిమిట్ లేకుండా సీరియల్స్ తరహాలో వెబ్ సిరీస్ లను కొనసాగిస్తున్నారు. అవకాశాల కోసం ఇప్పుడు ఎవరి వెంట తిరగాల్సిన అవసరం లేదు. సొంతంగా మంచి కంటెంట్ తో కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే యూ ట్యూబ్ బిజినెస్ తో మంచి ఆదాయాన్ని అందుకోవచ్చని యువత ప్లాన్ చేసుకుంటోంది.

 సూర్య వెబ్ సిరీస్ కూడా..

సూర్య వెబ్ సిరీస్ కూడా..

నెటిజన్లు ఒక్కసారి కనెక్ట్ అయితే ఏ వెబ్ సిరిస్ ని కూడా అంత ఈజీగా వదలడం లేదు. షణ్ముక్ జశ్వంత్ నటించిన సూర్య వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఒక్క వెబ్ సిరీస్ తోనే షణ్ముక్ నెల సంపాదన 10లక్షలు దాటినట్లు టాక్ వస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు ఈజీగా 10 మిలియన్స్ వ్యూవ్స్ అందుతున్నాయి.

 30 వెడ్స్ 21 మ్యాజిక్

30 వెడ్స్ 21 మ్యాజిక్

ఇక అదే తరహాలో ప్రస్తుతం యూ ట్యూబ్ వరల్డ్ లో 30 వెడ్స్ 21 అనే కపుల్స్ వెబ్ సిరీస్ వైరల్ గా మారింది. దాదాపు 11 ఏళ్ళ ఈజ్ డిఫరెన్స్ ఉన్న ఇద్దరు భార్య భర్తల మధ్య జరిగే అందమైన గొడవలను, అలకలను, ప్రేమను ఈ వెబ్ కంటెంట్ లో అందంగా ప్రజెంట్ చేశారు. నటి అనన్య, చైతన్య రావ్ పాత్రలు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి.

ఎవడు చూస్తాడు అనుకున్నాను

ఎవడు చూస్తాడు అనుకున్నాను

అయితే ఈ వెబ్ కంటెంట్ పై దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొదట మేకర్స్ కాన్సెప్ట్ గురించి నాతో చెప్పినప్పుడు 30 వెడ్స్ 21 ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్ లో కొత్తగా చూపించడానికి ఏముంటుంది. మన అమ్మ నాన్న లకు చాలా వరకు 15 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. అందరికి తెలిసిందే. ఇలాంటి కంటెంట్ ను ఎవడు చూస్తాడు అని అనుకున్నట్లు.. హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Chiranjeevi, Ram Charan Started Oxygen Banks In Telugu States
నేను అనుకున్నది తప్పని నిరూపించారు

నేను అనుకున్నది తప్పని నిరూపించారు

అయితే ప్రస్తుతం 30 వెడ్స్ 21 సిరీస్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి హరీష్ శంకర్ స్పందించాడు. నిజంగా నేను అనుకున్నది తప్పు అని మొదటి ఎపిసోడ్ తోనే నిరూపించారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా టీమ్ అందరికి బెస్ట్ విషెస్ అందిస్తున్నాను. ఇలానే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.. అని హరీష్ శంకర్ మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X