Just In
- 7 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ అంటే పడి చచ్చే డైరక్టర్ ని
ఇప్పుడే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను. పంజా ట్రైలర్ చూసా,ఓరి నాఅయ్యా..మాటల్లేవంతే...ఆ లుక్,ఆ వాక్ ..ఆ టాకంగ్..వావ్...పంజా ట్రైలర్ పగుల్స్,దేవుడి దర్శనం అయ్యినట్లుంది..ఇంక ప్రసాదం ఒక్కటే బాకీ ..కడుపు నిండడానికి. గడ్డం అంటే గ్యాంగ్ లీడర్ గడ్డం అనుకున్నా ఇన్నాళ్లూ,పంజా గడ్డమని తెలసే ఈనాడు. నా వల్ల కావట్లేదు బాబోయ్. వాంట్ టు సీ ఫిల్మ్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్. కానీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు,వెర్రి ఉన్న జాబ్ హోల్డర్స్ ఉంటారు,మెచ్చుకునే ఫ్యామిలీస్ ఉంటారు, ఇష్టపడే పిల్లలు ఉంటారు,కానీ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే డైరక్టర్ ని మాత్రం నేనే. నేను ఇప్పుడు ఓ ప్యాన్ గా ట్వీట్స్ చేస్తున్నా.ఆ కార్ షాట్ చూస్తుంటే తమ్ముడు సినిమాలోని హే..రా..రా..రా అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుకు వస్తోంది అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.హరీష్ శంకర్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఆడియోను నవంబర్ 13 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయమై నిర్మాత మీడియా సమావేశం నిర్వహించి...ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైంది.ఆడియోను నవంబర్ 13 న, విడుదల డిసెంబర్ 9 న చేయనున్నాము అని అన్నారు.అలాగే కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.