»   » కోలుకుంటున్న కోడి రామకృష్ణ

కోలుకుంటున్న కోడి రామకృష్ణ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ స్వల్ప అస్వస్థత కారణంగా ఇటీవల చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన కుటుంబీకులతో మీడియాతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, రెండుమూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.

  సినిమా షూటింగ్స్‌లో నిరవధికంగా పాల్గొనడం వలన ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారని కోడి రామకృష్ణ వ్యక్తిగత సహాయకుడు రాజు తెలిపారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆయన త్వరలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని రాజు చెప్పారు. కోడి రామకృష్ణ కూడా ఫోనులో మీడియాతో మాట్లాడారు. అర్జున్ తో కొత్త సినిమా ప్రారంభం రోజున ఆయన ఇలా అస్వస్ధకు లోనయ్యారు.

  ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సౌభాగ్య చిత్ర పతాకంపై ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ని ఎంచుకొన్నట్టు నిర్మాత కరాటం రాంబాబు వెల్లడించారు. ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని నిర్మాత తెలిపారు.

  దర్శకుడు కోడి రామకృష్ణ సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని ఈ చిత్రం కథ సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రంలో సత్య సాయి బాబాను ఆరునెలలు ప్రాయం నుంచి 85 ఏళ్ళ ప్రాయం వరకు వివిధ వయసుల్లో చూపెట్టనున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొత్తం ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనంలో కలిపోతూ సాగుతాయి. ఈ చిత్రంలో బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్‌బాబు నటిస్తున్నారు.

  English summary
  Legendary director kodi rama krishna has fell ill. While attending the fist day muhurat of his new film with Action Hero Arjun, director Kodi was in Chennai and was reported to be active oozing with energy. All of the sudden, Kodi reported of Heart Pain and was rushed to near by Vijaya Hospital in Vadapalani to get admitted into ICU. Currently he is known to be stable in condition. He will discharage in two days.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more