»   » డైరెక్టర్ క్రిష్ ఎంగేజ్మెంట్‌: బాలయ్య, బన్నీ, ఇతర స్టార్స్ సందడి (ఫోటోస్)

డైరెక్టర్ క్రిష్ ఎంగేజ్మెంట్‌: బాలయ్య, బన్నీ, ఇతర స్టార్స్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గమ్యం, వేదం, కంచె... లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం బాలయ్యతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా చేస్తున్న ఆయన షూటింగ్ గ్యాపులో తన పెళ్లి వేడుకను ప్లాన్ చేసుకున్నారు.

మీరు విన్న నిజమే.....దర్శకుడు క్రిష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ఆయన వివాహం హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చయమైందని, ఆవిడ పేరు రమ్య. సినిమాల పిచ్చిలో పడి తన పెళ్లి విషయం గురించి పెద్దగా పట్టించుకోని క్రిష్‌కు ఇంట్లో వాళ్లే ఈ సంబంధం కుదిర్చారట.

క్రితం సంవత్సవం వరకూ క్రిష్ ..వివాహం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తల్లి కోరిక మేరకు ఆయన ఓకే చెప్పి, పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆగస్టులో వివాహం జరగబోతోంది. తాజాగా హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలయ్య దంపతులు కూడా హాజరయ్యారు.

స్లైడ్ షోలో క్రిష్ ఎంగేజ్మెంట్ ఫోటో, ఆయనకు కాబోయే భార్య ఫోటో...

ఎంగేజ్మెంట్

ఎంగేజ్మెంట్

ఇటీవల హైదరాబాద్‌లో క్రిష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది.

పెళ్లి

పెళ్లి

సినిమాలతో బిజీగా ఉన్న కరిష్ క్రితం సంవత్సవం వరకూ క్రిష్ ..వివాహం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తల్లి కోరిక మేరకు ఆయన ఓకే చెప్పారట.

కాబోయే భార్య

కాబోయే భార్య

హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చయమైందని, ఆవిడ పేరు రమ్య

బాలయ్య దంపతులు

బాలయ్య దంపతులు

బాలయ్య నటిస్తున్న 100వ సినిమా ‘గౌతమీ పుత్రశాతకర్ణి'కి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

రాఘవేంద్రరావు అండ్ ఫ్యామిలీ

రాఘవేంద్రరావు అండ్ ఫ్యామిలీ

క్రిష్ ఎంగేజ్మెంట్ వేడుకలో రాఘవేంద్రరావు, ఆయన కొడుకు ప్రకాష్, కోడలు కనిక

అల్లు అర్జున్

అల్లు అర్జున్

క్రిష్ ఎంగేజ్మెంట్ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్, క్రిష్ కాంబినేషన్లో గతంలో వేదం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

సిరివెన్నెల

సిరివెన్నెల

క్రిష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు.

రానా

రానా

క్రిష్ ఎంగేజ్మెంట్ వేడుకలో రానా

English summary
Filmibeat team hearty congratultions and best wishes to ‪Director Krish‬ for entering into his marraige life - Engagement done.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu