Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్వర్గంలో ఎవర్ని చేసుకున్నానో మొన్నే గుర్తొచ్చింది: క్రిష్ (ఇన్విటేషన్ ఫొటో)
హైదరాబాద్: ప్రముఖ దర్సకుడు క్రిష్ పెళ్లి శుభలేఖ చూశారా? ...ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే క్రిష్ అంత స్పెషల్ గా ఆ వెడ్డింగ్ కార్డ్ ని డిజైన్ చేసారు. డిజైన్ అంటే హంగులతో అని కాదు..పొయిటిక్ టచ్ తో ఈ శుఖలేఖ సాగింది.
జూన్ 25న డాక్టర్ రమ్యతో నిశ్చితార్థం అయిన క్రిష్ విహాహం ఉస్మాన్‌సాగర్ లేక్ దగ్గర ఉన్న గోల్కొండ రిసార్ట్‌లో ఈనెల 7న అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ ప్రముఖులు మొత్తం హాజరుకానున్నారు.
తన దర్శకత్వంలో రూపొందే సినిమాలను విభిన్నంగా తెరకెక్కించడంలో ప్రత్యేక పంథా అనుసరించే 'క్రిష్' తన వివాహ శుభలేఖ విషయంలోనూ అదే ప్రత్యేకతను ప్రదర్శించారు. బాపు గీతలతో అందంగా రూపుదిద్దుకున్న శుభలేఖ ఓ ఉత్తరంలా మనలని ఉద్దేశించి రాసినట్లు అనిపిస్తుంది. ఆ లేఖని మీరు ఇక్కడ చూడవచ్చు.
కొద్ది కాలం క్రితం క్రిష్ నిశ్చితార్థం డాక్టర్ వెలగ రమ్యతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ట్రిడెంట్ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి సతీసమేతంగా బాలకృష్ణ, అల్లుఅర్జున్, రానాతోపాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు.
స్లైడ్ షోలో శుభలేఖ మరియు...మరిన్ని విశేషాలు...

ఆసక్తి చూపలేదు
సినిమాలపై దృష్టితో క్రితం సంవత్సవం వరకూ క్రిష్ ..వివాహం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

తల్లి కోరికపై
కానీ తల్లి కోరిక మేరకు ఆయన ఓకే చెప్పి, పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అపోలోలో
డాక్టర్ రమ్య ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పటిల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.

బిజీగా
ప్రస్తుతం క్రిష్ బాలయ్య వందో సినిమా 'గౌతమిపు్ర శాతకర్ణి' షూటింగ్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది.

గుర్తింపు
గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ క్రిష్

ఉత్సాహంగా..
తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మార్పుకు స్వాగతం పలుకుతూ ఉత్సాహంగా ఉన్నారు క్రిష్.

గ్యాప్ తీసుకోవటం తప్పదు
నిశ్చితార్దం కోసం, వివాహం కోసం షూటింగ్ నుంచి క్రిష్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

అందుకే లేటు
పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఎంత ఒత్తిడి చేసినా వృత్తి పరమైన ఒత్తిడిలో క్రిష్ ముందడగు వేయలేకపోయారు

నో లవ్ స్టోరీస్
ఇది ప్రేమ వివాహం అని ప్రచారం జరుగుతున్నా..అలాంటిదేమీ లేదని పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది.

ఇద్దరూ మాట్లాడుకునే
నిశ్చితార్దానికి ముందు క్రిష్, రమ్య ఇద్దరూ మాట్లాడుకునే వివాహ డెషిషన్ తీసుకున్నారు.

గ్రీన్ సిగ్నల్
మాటలు కలిసాక, ఒకరితో మరొకరు జీవితం పంచుకోగలమని అనిపించాకే ఇధ్దరూ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చారు.

జాతీయ అవార్డ్ కోసం
తనకు జాతీయ అవార్డ్ వచ్చాకే వివాహం చేసుకుందామని ఆగాడని అంటారు. కంచెతో ఆ కోరిక తీరింది.

గమ్యంతో మొదలెట్టి
ఎంటర్టైన్మెంట్ తో కూడిన సందేశాత్మక చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు క్రిష్.

కంచె,గమ్యం
క్రిష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు వేదం, గమ్యం, కంచె అని చెప్పాలి.

విభిన్నమైన కథలు
తన సినిమాలు రొటీన్ మాస్ మసాలా చిత్రాలుకు భిన్నంగా , విభిన్నంగా ఉండాలని కోరుకోవటమే ఆయన సక్సెస్.