Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
జగన్‌కు కేసీఆర్ మరో సవాల్- తేనెతుట్టెను కదుపుతూ-బీజేపీ నుంచీ తప్పని ఒత్తిడి
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరు నుంచి బాలయ్య దాకా అంతా సందడే సందడి(క్రిష్ పెళ్లి ఫొటోలు)
హైదరాబాద్ : క్రిష్.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని ఇస్తున్నారు. రమ్య.. ఓ డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇద్దరి వృత్తులూ భిన్నమైనప్పటికీ చేస్తున్నది మాత్రం సేవే. ఈ ఇద్దరూ నిన్న ఆదివారం రాత్రి ఒకింటివాళ్లు అయ్యారు.
వివరాల్లోకి వెళితే...ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) వివాహం డా.రమ్యసాయితో హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.
మేళతాళాలు, వేదమంత్రాల మధ్య రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో జరిగిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, డా. రమ్యసాయిల వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''...
నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్ పంపిన ఆహ్వానాన్ని అందుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
'గమ్యం' నుంచి 'కంచె' వరకూ విలక్షణ చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్ తన వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కూడా కొత్తదనం చూపించారు.ఇంత ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఎవరికి మాత్రం వెళ్లాలని ఉండదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, నాగచైతన్య, రామ్, గోపీచంద్, కార్తి, శ్రీకాంత్, సుమంత్, సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్.ఎస్.రాజమౌళి వచ్చారు.
ఇక హీరోయిన్స్ రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, తెదేపా నేత నారా లోకేష్, లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటని ఆశీర్వదించారు.
స్లైడ్ షోలో పెళ్లి ఫొటోలు చూడండి..

బాలయ్య
క్రిష్ వివాహ వేడుకలో దర్శకుడు కోవెలమూడు సూర్య ప్రకాష్

ఘనంగా
క్రిష్ వివాహ వేడుకలో అల్లు అరవింద్ ఇలా మెరిసారు

అంతా
క్రిష్ వివాహ వేడుక కు ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ

ఆనందోత్సాహం
క్రిష్ వివాహ వేడుకకు వస్తూనే అల్లు అరవింద్ అందరినీ విష్ చేస్తూ కనిపించారు

సుమంత్
సుమంత్, సూర్య ప్రకాష్ క్రిష్ వివాహ వేడుకకు హాజరయ్యారు

నవ్వుతూ
హీరో సుమంత్ ... క్రిష్ వివాహ వేడుక కు హాజరయ్యారు

ఫొటోలకు స్టిల్స్
హీరో సుమంత్..ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ ఇలా కనిపించారు

సురేష్ బాబు
నేను వచ్చేస్తున్నా అన్నట్లుగా సురేష్ బాబు ...సరదాగా

చిరు ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇలా ఇచ్చారు

చిరు సందడి
చిరంజీవి వస్తూంటే ఆ సందడే వేరు, ఆ లుక్కేవేరు

విషెష్
చిరంజీవి...నూతన దంపతులకు బెస్ట్ విశెష్ తెలియచేసారు

శంకర్ దాదా
చిరంజీవి నడకలో శంకర్ దాదా స్టైల్ కనపడుతోంది చూసారా

అదుర్స్
చిరంజీవి ఈ వయస్సులో ఇలా ఉండటం ఆశ్చర్యమే కదూ

ఏం చెప్తున్నారు
చిరంజీవి ఏదో చెప్తున్నట్లున్నారు కదూ... ఆ వేలు చూపెడుతూ..

లగడపాటి
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నూతన దంపతులని ఆశ్వీరదించటానికి

గొల్లపూడి
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతి రావు..ఈ కొత్త జంటను ఆశ్వీరదించటానికి వస్తూ..

చైతూ
అక్కినేని నాగచైతన్య ...ఈ వివాహానికి వచ్చారు

రాఘవేంద్రరావు
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ వివాహానికి విచ్చేసినప్పుడు

తణికెళ్ల భరణి
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తణికెళ్ల భరణి...ఈ వివాహానికి విచ్చేసారు

అల్లు అర్జున్
యూత్ ఐకాన్ అల్లు అర్జున్ వస్తున్న క్షణాలు

వేదంలో
క్రిష్ దర్సకత్వంలో వచ్చిన వేదం చిత్రంలో బన్ని నటించారు

రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ వస్తున్నప్పుడు...

సీరియస్
ఏదో సీరియస్ ఆలోచనతో రాధాకృష్ణ వస్తున్నట్లున్నారు

జయసుధ
అలనాటి హీరోయిన్, నేటి క్యారక్టర్ ఆర్టిస్టు జయసుధ ఎంట్రీ ఇస్తూ

ఆ కళే వేరు
జయసుధ వచ్చేసరికి పెళ్లి కళ మారిపోయింది కదూ

అనుబంధం
క్రిష్ ఎక్కువగా జయసుధని అభిమానిస్తారు. అందుకే ఆమె ఇలా తరిలివచ్చారు

శ్యామ్ ప్రసాద్ రెడ్డి
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ వివాహానికి విచ్చేసి..

గుర్తుపట్టారా
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు..ఇదిగో ఇలా

రమేష్ ప్రసాద్ గారితో
సింగీతం గారు తన మిత్రుడు రమేష్ ప్రసాద్ గారితో ఇలా ..

సరదాగా
ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వివాహంలోకి వచ్చారు.