»   » కృష్ణవంశీ ఇన్‌సల్ట్ చేశారనే...: మంచు విష్ణు

కృష్ణవంశీ ఇన్‌సల్ట్ చేశారనే...: మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓసారి కృష్ణ వంశీ గారిని 'నాతో యాక్షన్ సినిమా చేస్తారా?' అని అడిగితే.. 'నీతో యాక్షనా? కామెడీ సినిమా చేస్తా' అని ఇన్‌సల్ట్ చేశారు. బాగా సన్నబడి, మూడు నెలల తర్వాత ఆయన ముందుకెళితే, గుర్తు పట్టలేకపోయారు అంటూ తన సన్నబడటానికి కారణం కృష్ణ వంశీ అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

అలాగే ఆపరేషన్ చేయించుకుని తగ్గారని టాక్ ని ఖండిస్తూ... అని చాలామంది అనుకుంటారు కానీ, ఏ ఆపరేషన్ చేయించుకున్నా ఇంతలా ఎవరూ తగ్గరు. 'ఒక్క నెల నీది కాదని ఫిక్స్ అవ్వన్నా.. తగ్గిపోతావ్' అన్నాడు మనోజ్. కృష్ణవంశీగారు నన్నలా అన్న మూడు రోజులకు నాన్నగారు 'ఏరా.. నాకు మంచి బాడీ అంటే ఇష్టం. డబ్బులు లేక అప్పట్లో నేను అనుకున్న బాడీని తెచ్చుకోలేకపోయాను. మీకు అన్నీ సమకూర్చాను కదా. మరి నేననుకున్న బాడీని మీరు తెచ్చుకోలేరా?' అనడిగారు.

ఆరోజు నాన్నగారి మాటల్లో ఆవేదన కనిపించింది. దాంతో బలంగా ఫిక్స్ అయ్యి, వర్కవుట్లు మొదలుపెట్టాను. ఈరోజు నా ఫిజిక్ బాగుంటుందని చాలామంది అంటున్నారు. కానీ ...వెయిట్ అండ్ సీ... నా శరీరాకృతిలో ఇంకా మార్పుని చూస్తారు. ఇప్పుడు కృష్ణవంశీతో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. ఇంకా బాపుగారు, దాసరిగారు, రాఘవేంద్రరావుగారు.. ఇలా చాలామంది దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది అన్నారు విష్ణు.

ఇక మంచు విష్ణు హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై డా.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఆరియానా- వివియానా సమర్పకులు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు మారిన నేపధ్యంలో దాన్ని అక్టోబర్ 17 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన రానుంది.

ప్రపంచ వ్యాప్తంగా విష్ణు కెరియర్‌లోనే అత్యథిక థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల తరువాత అదే తరహాలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఉంది.

English summary
Manchu Vishnu said ‘I met Krishna Vamsi and asked him to do an action film with me. He said that he would do a comedy film with me looking at my beefy Physique. I took it as an insult and within three days I hit the gym and now I am going to get remarkable changes in my body”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu