»   » అప్పులు చేసా, తిడతారని తెలుసు, ఆ భయంతో నా పేరు వేసుకోలేదు: మారుతి

అప్పులు చేసా, తిడతారని తెలుసు, ఆ భయంతో నా పేరు వేసుకోలేదు: మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో మారుతి ఒకరు. ఈ రోజుల్లో లాంటి చిన్ని సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన మారుతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస అవకాశాలతో దసుకెళ్లాడు.

అయితే మారుతి దర్శకత్వంలో తొలి నాళ్లలో వచ్చిన 'ఈరోజుల్లో', 'బస్టాప్' లాంటి చిత్రాలు లాభాలతో పాటు మారుతికి కాస్త చెడ్డ పేరును కూడా తెచ్చిపెట్టాయి. అందుకు కారణం సినిమాలో బూతు కంటెంటు ఉండటమే.

ఇటీవల డైలాగ్ విత్ ప్రేమ అనే ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలపై మారుతి స్పందించారు. 'ఈరోజుల్లో' కంటే ముందు 'బస్టాప్' మూవీనే మొదలైందని, అయితే డబ్బుల్లేక ఆ సినిమా మధ్యలో ఆపేసామని తెలిపారు.

 అప్పులు చేసా

అప్పులు చేసా

‘బస్టాప్' మూవీ ఆగిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ స్పూర్తితో 5డి కెమెరాతో ‘ఈ రోజుల్లో' సినిమా చేసాం. ఈ రోజుల్లో సినిమా చేసే సమయంలో చేతిలో డబ్బు కూడా లేదు. స్నేహితుల వద్ద రూ. 15 లక్షలు అప్పు చేసి తీసామని తెలిపారు మారుతి.

 కన్నీళ్లు పెట్టుకున్నా

కన్నీళ్లు పెట్టుకున్నా

‘ఈరోజుల్లో' సినిమా విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. టెక్నికల్ గా ఎన్నో సమస్యలు. ఆ పరిస్థితులు తట్టుకోలేక ఓ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నాం. మొత్తానికి సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. మంచి లాభాలు తెచ్చింది. అలా వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేసి ఆగిపోయిన ‘బస్టాప్' మూవీని మొదలు పెట్టామని మారుతి తెలిపారు.

 తిడతారని తెలుసు

తిడతారని తెలుసు

బస్టాప్ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంటుపై విమర్శలు వస్తాయని తెలుసు. ఈ సినిమా విడుదలైతే తిట్లు పడాల్సి వస్తుందని ముందుగానే అందుకు సిద్ధమయ్యాను. ఊహించినట్లుగానే తిట్లు వచ్చాయి, డబ్బులు కూడా వచ్చాయని మారుతి తెలిపారు.

 దర్శకుడిని నేనే కానీ పేరు వేసుకోలేదు

దర్శకుడిని నేనే కానీ పేరు వేసుకోలేదు

‘ప్రేమకథా చిత్రమ్' సినిమాకు దర్శకత్వం నేను వహించాను. సినిమాకు సంబంధించిన ప్రతి షాటు నేను తీసాను. నిర్మాతను కూడా నేనే. అయితే దెయ్యంతో సినిమా అంటే ఎవరూ చూడరేమో అనే భయంతో నా పేరు వేసుకోకుండా... సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన జె ప్రభాకర్ రెడ్డి పేరును దర్శకుడిగా వేయాల్సి వచ్చిందని మారుతి తెలిపారు.

English summary
After co-producing films like Premisthe and A Film by Aravind, Maruthi made his directorial debute through Ee Rojullo movie and turned out to be very successful director, with blockbuster movies like Bhale Bhale Mogadivoy. Check out interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu