twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా ఎన్‌.శంకర్‌

    By Srikanya
    |

    N Shankar
    హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కార వేడుకలకు భారతీయ సినిమాలు ప్రతిపాదించేందుకు ఏటా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. మొత్తం 17 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు నుంచి ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఈ యేడు ఎంపికయ్యారు. ఆస్కార్‌ పురస్కారాల్లో విదేశీ భాషా విభాగానికి మన దేశం నుంచి పంపాల్సిన సినిమాల్ని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ప్రక్రియలో ఎన్‌.శంకర్‌ పాల్గొంటారు.

    ఈయన గతంలో నంది పురస్కార కమిటీ సభ్యునిగా రెండు సార్లు, అధ్యక్షునిగా ఒకసారి వ్యవహరించారు. దీంతోపాటు గోవా ఫిలిం ఫెస్టివల్‌, జాతీయ సినిమా అకాడమీ పురస్కారాల జ్యూరీకి సభ్యునిగానూ పని చేశారు. ప్రస్తుత ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీలో ఈయనతోపాటు నిర్మాత సీవీరెడ్డి కూడా తెలుగు నుంచి సభ్యులుగా ఎంపికయ్యారు.

    ఇక సీనియర్ దర్శకుడిగా చిత్ర పరిక్షిశమకు చెందిన పలు అవార్డు కమిటీల్లో వివిధ హోదాల్లో పనిచేశారాయన. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక ఆస్కార్ ఫిల్మ్ అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్‌గా ఎన్నికవటంతో పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసే భారతీయ సినిమాల్ని ఈ కమిటీ ఎంపికచేస్తుంది. సినిమాకు సామాజిక ప్రయోజనం వుందని బలంగా విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సామాజిక స్పృహ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

    తె లుగులో తొమ్మిది చిత్రాలను రూ పొందించిన ఆయన దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. 2003 లో నేషనల్ ఫిలిం అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా విశిష్ట సేవలందించిన శంకర్ 2010లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నంది అవార్డుల కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. మరో రెండు సార్లు నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా పనిచేసిన ఆయన 2009లో గోవా ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా సేవలందించారు. తెలుగు చిత్రసీమకు చెందిన ఎన్.శంకర్ ఆస్కార్ కమిటీ జ్యూరీ మెంబర్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు చిత్రసీమకు చెందిన ప్రముఖులు ఆయనకు అభినందనలు అందజేశారు. జాతీయ స్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఇనుమడింపజేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    
 N Shankar, Telugu filmmaker, has been nominated by Film Federation to be a part of the 16 member jury of the Oscar Screening Committee, which will select the India's official entry at the Oscar 2013. The selection committee comprising of filmmakers, artistes and technicians from all over the country will be viewing films nominated from India, on September 17, in Hyderabad. "I feel privileged to have been nominated for the responsibility. I'm looking forward to watching the best movies made in the country in the last year," said the director, who has earlier served as jury of Nandi Awards, National Awards and International Film Festival of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X