For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామ్ చరణ్ తో సినిమా చేయడం నా వల్ల కాదు!

By Bojja Kumar
|

హైదరాబాద్: రామ్ చరణ్ తో సినిమా చేయడం నా వల్ల కాదంటూ దర్శకురాలు నందినిరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేసారు. తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించారు.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...‘స్టార్ హీరో డేట్స్ ఇస్తే తప్ప... ఒక ప్లాప్ డైరెక్టర్ తో సినిమాలు చేడానికి ఏ నిర్మాత ముందుకురారు. అయినా నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు. రామ్ చరణ్ ఎవరితోనైనా పని చేయాలని అనుకుంటే...దర్శకులు 4 రోజుల్లో స్క్రిప్టు ప్రిపేర్ చేస్తారు. అలా చేయడం నా వల్ల కాదు. నాకు సబ్జెక్టు ఇంపార్టెంట్. పలానా హీరోను మైండ్ లో పెట్టుకుని స్క్రిప్టు రెడీ చేయడం నా వల్ల కాదు' అని స్పష్టం చేసారు నందినిరెడ్డి.

Director Nandini Reddy about Ram Charan

త్వరలో విడుదల కాబోతున్న తన ‘కళ్యాణ వైభోగమే' సినిమా గురించి మాట్లాడుతూ....‘కళ్యాణ వైభోగమే నేను స్వయంగా రాసిన ఫస్ట్ స్ర్కిప్టు. అయితే చాలా కాలం ఈ కథ గురించి ఎవరికీ చెప్పలేదు. కెరీర్ మొదట్లోనే మ్యారేజ్ సిస్టమ్, రిలేషన్ షిప్ మీద చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ‘అలా మొదలైంది' సినిమా తర్వాత సిద్ధార్థ్-సమంతలకు ఈ స్క్రిప్టు గురించి చెప్పాను కానీ అది వర్కౌట్ కాలేదు' అన్నారు. తన ఫేవరెట్ మూవీ ‘మౌనరాగం' నుండి ఇన్ స్పైర్ అయి ఈ సినిమా స్క్రిప్టును సిద్దం చేసినట్లు నందినీ రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే' చిత్రం నాగశౌర్య, మాళవిక నాయర్‌ తో తెరకెక్కించారు నందినిరెడ్డి. రంజిత మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ కోడూరి సంగీతం అందించారు. ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమయ్యేలా కామెడీ, సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కథా చిత్రం "కళ్యాణ వైభోగమే".

Director Nandini Reddy about Ram Charan

నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం), రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధనరాజ్, 'మిర్చి' హేమంత్, స్నిగ్ధ తదితరులు, సాంకేతిక నిపుణులు : సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జి.వి. ఎస్. రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్, రఘు, అని యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ, వైశాలి డైలాగ్స్ & లిరిక్స్: లక్ష్మీ భూపాల్ కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి . వి ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి.

English summary
'No Producer comes forward to produce a film with Flop Director, unless a Star Hero offers his dates. But, I don't have such dreams. If Ram Charan is willing to work, There are directors who prepare a story within 4 days. But, I'm not that kind of a person. Subject is important for me and I can't prepare a story keeping any particular hero in mind,' Nandini Reddy told.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more