»   » ఎవరితోనూ మాట్లాడలేదు.. ‘డ్రగ్’ నోటీసులపై స్పందించిన పూరీ జగన్నాథ్

ఎవరితోనూ మాట్లాడలేదు.. ‘డ్రగ్’ నోటీసులపై స్పందించిన పూరీ జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్ కేసు వ్యవహారంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో స్పందించారు. డ్రగ్ సప్లయర్లతో సంబంధముందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై తాను ఇప్పటివరకు స్పందించలేదని ఆయన ట్విట్ చేశారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్‌ నేపథ్యంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ పూరీ జగన్నాథ్‌కు నోటీసులు జారీ చేశారనే వార్త మీడియాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.

డ్రగ్ వ్యవహారం గురించి నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. దేనికి గురించి చర్చించలేదు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న పైసా వసూల్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాను అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు నటులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Director Puri Jagannadh responded on drug Issue in twitter. He said he never talk to anyone in this regards. He was busy with finishing the Balakrishna's Paisa Vasool movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu