»   » 'జిల్‌' టైటిల్ పెట్టడానికి కారణం అదా?

'జిల్‌' టైటిల్ పెట్టడానికి కారణం అదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''ఈ చిత్రానికి 'జిల్‌' అనే పేరు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. హీరోయిన్ ని చూడగానే.. హీరోకి హృదయం 'జిల్‌'మంటుంది. హీరోని చూడగానే విలన్ కీ అదే భావన. అందుకే ఆ పేరు పెట్టాం'' అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణ. 'జిల్‌' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారీయన. గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం 'జిల్‌'. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం రాధాకృష్ణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'ప్రతి ఫైర్‌మెన్‌లోనూ నాకు ఓ హీరో కనిపిస్తాడు. ఎక్కడైనా మంటలు రేగితే... అందరూ పారిపోతారు. కానీ వాళ్లు మాత్రం మంటల్ని వెదుక్కొంటూ వెళ్తారు. అందుకే.. హీరోని ఫైర్‌మెన్‌ చేశాను అన్నారు. 'ప్రేక్షకుల వూహలకు అతీతంగా సాగే సినిమాలంటే నాకిష్టం. నేనూ అలాంటి కథల్ని ఎంచుకొంటా' అంటున్నారు రాధాకృష్ణ.


Director Radha Krishana revel about Jil Tilte

ఇక... చంద్రశేఖర్‌ యేలేటి గారి దగ్గర నాలుగు సినిమాలకు పనిచేశాను. 'ఒక్కడున్నాడు' సమయంలోనే గోపీచంద్‌ గారికి ఈ కథ చెప్పా. 'బాగుంది.. మనం చేద్దాం' అన్నారు. అప్పటి నుంచీ ఈ కథపైనే దృష్టిపెట్టాను. గోపీచంద్‌ని చాలా స్త్టెలిష్‌గా చూపించావ్‌.. అని అందరూ అంటున్నారు. కథ రాసుకొన్నప్పుడే ఆయన పాత్రని అలా వూహించుకొన్నా అన్నారు.


అలాగే ...'కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు, రాజమౌళి, చంద్రశేఖర్‌ యేలేటి నా అభిమాన దర్శకులు. ఓ సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉండాలి అనే విషయాన్ని యేలేటి సార్‌ దగ్గర నేర్చుకొన్నా. స్టార్ హీరోల కోసం కథలు సిద్ధం చేసుకొన్నా' అని అన్నారు.


చిత్రం కథేమిటంటే...


జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...జై తన ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా రంగనాధ్ (బ్రహ్మాజి) అనే వ్యక్తిని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు.


అతనికీ విలన్ వెనక పడటాని కీ లింక్ ఏమిటీ అంటే... ఆ రంగనాథ్ మరెవరో కాదు..ఆ డాన్ దగ్గర నుంచి వెయ్యి కోట్లు డబ్బు కొట్టేసి పారిపోయినవాడు. అయితే మన హీరో రక్షించినప్పుడు ...రంగనాథ్ చివరి క్షణాల్లో మాట్లాడతాడు. దాంతో మన హీరోకు ఆ డబ్బు వివరాలు చెప్పాడని విలన్ కు డౌట్ వస్తుంది. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. ఆ విషయాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

English summary
Jil is the newly released Telugu film starring the handsome Gopichand and the gorgeous Rashi Khanna. Jil (2015) has finally the theaters last friday and is getting great response from all kinds of audience. After the accomplishment of Loukyam and Run Raja Run, both Gopichand and UV Creations peered toward on the hatrick hit with the Jil Movie.
Please Wait while comments are loading...