»   » వెంకటేష్ కన్నా చిరంజీవికే రాజమౌళి ప్రయారిటి

వెంకటేష్ కన్నా చిరంజీవికే రాజమౌళి ప్రయారిటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తను చిన్నప్పుడు చిరంజీవి చంటబ్బాయి చిత్రాన్ని చూసి టోటల్ గా షాకయ్యానని, అలాగే చిరంజీవిలాంటి స్టార్ కామిడీ రోల్ కనపడటం ఇంప్రెస్ చేసిందని అన్నారు. అలాగే తాను అప్పట్లో చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ ని అని, ఢిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన కనపడటం చాలా ఆనందపరిచేదని చెప్పుకొచ్చారు. అలాగే తమ అంకుల్ వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రం చూసి వచ్చి బాగుందని తనను కూడా వెళ్ళమంటే తాను ఆ డబ్బుతో చంటబ్బాయి చిత్రానికే ప్రయారిటే ఇచ్చానని అన్నారు. అప్పటికే చంటబ్బాయి చూసినా మళ్ళీ ఆ చిత్రానికే ప్రయారిటీ ఇచ్చానన్నారు. అంత ప్రాణం అప్పట్లో చిరంజీవి సినిమాలంటే అని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవిని ..రాజమౌళి తన మగధీర చిత్రంలో బంగారు కోడిపెట్టి పాటలో డైరక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu