»   » ఎందుకు ఇన్నిసార్లు? నా బ్రెయిన్ ఆలోచనలో పడింది: రాజమౌళి

ఎందుకు ఇన్నిసార్లు? నా బ్రెయిన్ ఆలోచనలో పడింది: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నిన్ను కోరి' ట్రైలర్ చూసిన వెంటనే దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి ట్వీట్ వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

రాజమౌళి ఆ ట్వీట్ చేసిన నేపథ్యంలో 'నిన్ను కోరి' సరికొత్త ఐడియాతో డిఫరెంటుగా ఓ చిన్న కార్యక్రమం చేపట్టారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి... ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లాంచ్ చేశారు. ఆ టికెట్‌ను ఆయనకే బహుమతిగా అందజేశారు.


నా బ్రెయిన్ అంచనా వేయడం మొదలు పెట్టింది

నా బ్రెయిన్ అంచనా వేయడం మొదలు పెట్టింది

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ - ''ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ లాంచ్‌ చేసే ఐడియా చాలా బాగుంది. 'నిన్ను కోరి' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన వెంటనే చూశాను. ఇమ్మీడియెట్‌గా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చూశాను. ఆ తర్వాత ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నానని నా లాజికల్ బ్రెయిన్‌ అంచనా వేయడం మొదలు పెట్టింది.. అని రాజమౌళి తెలిపారు.


ఎనలైజ్ చేస్తే చివరకు అదే అని తెలిసింది

ఎనలైజ్ చేస్తే చివరకు అదే అని తెలిసింది

మొదట ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. ట్రైలర్‌ చాలా రిచ్‌గా వుంది. మా దానయ్యగారు బాగా ఖర్చుపెట్టి తీశారు అనుకున్నాను. ఈ ట్రైలర్‌ ఎందుకని ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని ఎనలైజ్‌ చేశా. ట్రైలర్‌ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్‌ రీజన్‌ నాని తాలూకా కాన్ఫిడెన్స్‌ అన్పించింది... అని రాజమౌళి తెలిపారు.


నాని సూపర్ కాన్ఫిడెన్స్

నాని సూపర్ కాన్ఫిడెన్స్

నేను ఏదైనా జోక్ వేస్తే మీరు నవ్వుతారు, కంటతడి పెడితే నాతో పాటు మీరు కూడా బాధ పడతారు అన్న సూపర్ కాన్ఫిడెంట్‌ నానిలోకన్పించింది. తను చాలా మంచి యాక్టర్‌ అని అందరికీ తెలుసు. అతని కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చాలా బాగా పెరిగాయి. నాని కాన్ఫిడెంట్‌గా యాక్ట్‌ చేయడం బాగా నచ్చింది. నానికి పోటీగా నటించగలిగే అమ్మాయి నివేదా. ఆది చాలా బాగున్నాడు. అతని లుక్స్‌ ఫెంటాస్టిక్‌గా వున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. డైరెక్టర్‌ శివ ట్రైలర్‌ చాలా బాగా కట్‌ చేశారు... అన్నారు.


ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: హీరో నాని అదిరిపోయే స్పీచ్!

ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: హీరో నాని అదిరిపోయే స్పీచ్!

అభిమానుల గోలకు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిన హీరో నాని ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా అంటూ తన స్పీచ్ మొదలు పెట్టారు. నాని చెప్పిన విషయాలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


నాని స్పీచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Director Rajamouli interesting Speech at Ninnu Kori Movie Pre-Release Event. Check out Full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu