»   » రాజమౌళి ట్వీట్: ‘పటేల్ సర్’ మూవీపై మరింత హైప్

రాజమౌళి ట్వీట్: ‘పటేల్ సర్’ మూవీపై మరింత హైప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జగపతి బాబు హీరోగా తెరకెక్కిన 'పటేల్ సర్' చిత్రానికి బాహుబలి డైరెక్టర్ రాజమౌళి నుండి మంచి మార్కులే పడ్డాయి. శుక్రవారం ఉదయం ఆయన నిర్మాత సాయి కొర్రపాటి, తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో 'పటేల్ సర్' చూశారు.

సినిమా చూసిన వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'పటేల్ సర్' పాత్రలో జగపతి బాబు గారు అదరగొట్టారని జక్కన్న ట్వీట్ చేశాడు. దర్శకుడు వాసు పరిమి కొత్తవాడైనప్పటికీ అనుభవం ఉన్న వాడిలా సినిమాను హ్యాండిల్ చేశారని ప్రశంసించారు.


రాజమౌళి ట్వీట్

జగపతి బాబు పెర్ఫార్మెన్స్, దర్శకుడి పని తీరును పొగుడుతూ రాజమౌళి చేసిన ట్వీట్ ఇదే. రాజమౌళి ట్వీట్ చిత్ర యూనిట్‌లో మరింత ఉత్సాహం నింపింది.ఆ సాంగ్ బాగా నచ్చింది

పటేల్ సర్ చిత్రంలో అవ్వా బుజ్జి సాంగ్ తనకు బాగా నచ్చిందని, వారాహి చలన చిత్రం బేనర్లో ఇదో మంచి సినిమా అవుతుందని రాజమౌళి అభిప్రాయ పడ్డారు.సినిమాపై హైప్

సినిమాపై హైప్

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు రాజమౌళి జడ్జిమెంటు మీద చాలా నమ్మకం. ఆయన ఏదైనా సినిమా బావుందని ట్వీట్ చేశారంటే.... అది మంచి సినిమా అనే భావనకు వచ్చి థియేటర్లకు వెళ్లేవారు ఎందరో. తాజాగా ‘పటేల్ సర్' సినిమాపై రాజమౌళి ట్వీట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.


Jagapathi Babu's Patel SIR Movie Teaser Review | Filmibeat Telugu
పటేల్ సర్ రివ్యూ....

పటేల్ సర్ రివ్యూ....

పటేల్ సర్ మూవీ మనం ట్రైలర్ చూసి ఊహించిన విధంగా లేదు. ట్రైలర్ చూసి ఒక రకమైన ఎక్స్ పెక్టేషన్స్ తో వెళితే థియేటర్లో మీకు అసలు ఎక్స్‌పెక్ట్ చేయని సినిమా కనిపిస్తుంది.


పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి.


English summary
"Jagapathi Babu garu did a sincere and fabulous job as PATEL SIR. Expertly handled by the debutant director. Another feather in the cap for VaaraahiCC.. Avva bujji song is the best I've seen is recent times. #PatelSIR" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu