అల్లరి చెత్త సినిమా.. రవిబాబుపై ప్రొడ్యూసర్ ఫైర్.. నటించలేమని చేతులెత్తేశారు..

అల్లరి సినిమాతో దర్శకుడిగా తనను నిరూపించుకున్నాడు రవిబాబు. అయితే ఆ సమయంలో అది నిర్మించిన ప్రొడ్యూసర్ మాత్రం అదో చెత్త సినిమా అంటూ ఫైర్ అయ్యారని రవిబాబు చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ చానెల్‌లో ప్రసారమయ్యే ఇంటర్వ్యూలో పాల్గొని.. రవిబాబు పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

రవిబాబును చూసి భయపడే దాన్నంటూ అల్లరి ఫేమ్ సుభాషిణిని గతంలో అదే ఇంటర్వ్యూలో చెప్పడంతో.. ఎందుకు అంటూ ప్రశ్నించగా.. మొదటి సినిమా.. డైలాగ్ సరిగా చెప్పేది కాదు.. అలాంటి సమయంలో నేను ఏం చేయాలంటూ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

Director Ravibabu In His latest Interview Reveals Some facts

నీ డైరెక్షన్‌లో చేయలేం అని అన్నారట.. అని ప్రశ్నించగా.. ఇంకెవరు మా నాన్న చలపతి రావే అనుంటాడని చెప్పుకొస్తూ.. అవును సినిమా షూటింగ్ సినిమాలో జరిగిన సంగతులను వివరించాడు. అదే షూటింగ్‌లో హీరోయిన్ ఫైర్ అయిందట కదా అని అడగ్గా.. కెమెరాలో చిప్ పెట్టకుండా గంటపాటు ఆమెను రోప్‌తో వేలాడదీశామంటూ నాటి విషయాలను గుర్తుకుచేశారు.

పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు తీయలేదు.. అని అడగ్గా.. ఇక్కడి వచ్చే పెద్ద హీరోలను మీరే అడగండి.. రవిబాబుతో ఎందుకు తీయలేదు? అని రివర్స్ కౌంటర్ వేశాడు. అలాగే అల్లరి సమయంలో నిర్మాత కూడా కంగారుపడ్డాడని, ఇదో చెత్త సినిమా, ఇది తీసి మనం వేస్ట్ పని చేశామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X