»   » దర్శకుడి కూతురికి ప్రేమ వేధింపులు, రంగంలోకి పోలీసులు..

దర్శకుడి కూతురికి ప్రేమ వేధింపులు, రంగంలోకి పోలీసులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Director's Daughter faces Harassment
హైదరాబాద్: ఇటీవల కాలంలో యువతలపై ప్రేమ వేధింపులు, లైంగిక వేధింపులు తదితర సంఘటనలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ తెలుగు దర్శకుడి కూతురు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో పడింది. విషయం సీరియస్‌గా ఉండటంతో సదరు దర్శకుడు జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడా నుండి వచ్చిన ఓ యువకుడు తన కుమార్తెకు అసభ్యమైన మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు దర్శకుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే వివిధ కారణాల దృష్ట్యా ఆ దర్శకుడి పేరును పోలీసులు వెల్లడించడం లేదు.

వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు దొరికిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

అయితే ఆ దర్శకుడు ఎవరు? అనే విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి వేధింపులకు సంబంధించిన సీన్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి సంఘటన దర్శకుడు నిజజీవితంలో ఎదుర్కొనడం చర్చనీయాంశం అయింది.

English summary
Director's Daughter faces Harassment from florida based youth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu