twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రైన్ మిస్సయ్యింది.. అప్పుడే కథ మొదలైంది, ఘాజి దర్శకుడి కష్ఠాలు.. పిల్లల డబ్బు కూడా!

    |

    తొలి చిత్రంతోనే ప్రతిభ గల దర్శకుడు సంకల్ప్ రెడ్డి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఆయన తెరకెక్కించిన ఘాజి చిత్రం వెనుక దగున్న కన్నీటి కష్టాలని సంకల్ప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. సంకల్ప్ రెడ్డి తదుపరి తెరకెక్కించబోయే చిత్రం కూడా విభిన్నమైనదే. వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో రూపొందుతోంది. ఘాజి చిత్రం ఎలా మొదలైంది, అంతకు ముందు తాను పడ్డ ఇబ్బందులని సంకల్ప్ రెడ్డి వివరించారు. ఘాజి చిత్రం ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

    సిజి స్టూడియో పెట్టి

    సిజి స్టూడియో పెట్టి

    సినిమాపై ఉన్న మక్కువతో తాను 2010 లో సిజి స్టూడియో పెట్టానని సంకల్ప్ రెడ్డి అన్నారు. దీనివలన చిత్ర పరిశ్రమతో పరిచయాలు పెరుగుతాయని భావించా. పరిచయాల మాట పక్కన పెడితే చివరకు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోయానని, మధ్యలోనే స్టూడియో కు తాళం వేసేసానని సంకల్ప్ రెడ్డి అన్నారు.

    ట్రైన్ మిస్సయ్యింది

    ట్రైన్ మిస్సయ్యింది

    2012 లో తన భార్యతో కలసి చేరిన ఓ జర్నీ తన జీవితం మారిపోవడానికి కారణం అయిందని సంకల్ప్ రెడ్డి అన్నారు. పెళ్ళైన కొత్తలో తామిద్దరం అన్నవరం వెళ్ళాం. తిరుగు ప్రయాణంలో ట్రైన్ మిస్సయ్యింది. వైజాక్ కు వెళితే ట్రైన్స్ దొరుకుతాయని అక్కడకు వెళ్ళాం.

     ఘాజి కథ మొదలు అక్కడే

    ఘాజి కథ మొదలు అక్కడే

    విశాఖలో తాము ప్రయాణించాల్సిన ట్రైన్ కు ఇంకా రెండు గంటల సమయం ఉంది. ఈ లోపు బీచ్ కు సరదాగా వెళ్ళాం. అక్కడ ఓ సబ్ మెరైన్ ని గమనించా. అక్కడే ఘాజి కథ మొదలైందని సంకల్ప్ రెడ్డి అన్నారు. సబ్ మెరైన్స్ గురించి తెలుసుకోవడం ప్రారంభించా. అప్పుడే 1971 లో జరిగిన ఇండియా, పాక్ సబ్ మెరైన్ యుద్ధం గురించి తెలుసుకుని సినిమా తీయాలని ఫిక్స్ అయ్యా.

    సినిమా సగం పూర్తయ్యే సరికి

    సినిమా సగం పూర్తయ్యే సరికి

    కొత్త దర్శకుడితో సబ్ మెరైన్ సినిమా అంటే నిర్మాతలు ఒప్పుకోరు. అందుకే ముందుగా నన్ను నేను నిరూపించుకోవాలని భావించా. సొంతంగా ఓ సినిమా ప్రారంభించి యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నా. సినిమా సంగం పూర్తయ్యే సరికి డబ్బు మొత్తం అయిపోయింది. అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది.

    చివరకు పిల్లల డబ్బు కూడా

    చివరకు పిల్లల డబ్బు కూడా

    చివరకు పిల్లలకు బహుమతులుగా వచ్చిన డబ్బు కూడా సినిమాకు ఖర్చు చేయడానికి సిద్ధం అయిపోయా. ఆ క్షణాలు తలుచుకుంటే ఇప్పటికి కంట్లో నీళ్లు తిరుగుతాయి అని సంకల్ప్ రెడ్డి అన్నారు.

    రానా వెంటనే ఒప్పుకోవడంతో

    రానా వెంటనే ఒప్పుకోవడంతో

    ఘాజి కథతో పాటు, తాను చేసిన సిజి వర్క్ ని నిరంజన్ గారికి చెప్పా. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఆయన పెద్ద నిర్మాత ఆయన పివిపి గారికి చెప్పడం, ఓ పార్టీలో దీని గురించి రానా తెలుసుకుని వెంటనే అంగీకరించడం చక చకా జరిగిపోవడంతో తాను జాతీయ అవార్డు అందుకున్న చిత్రానికి దర్శకుడిని అయ్యానని సంకల్ప్ రెడ్డి అన్నారు.

    వరుణ్ తేజ్‌తో సినిమా

    వరుణ్ తేజ్‌తో సినిమా

    తన చిత్రాలు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే భిన్నమైన కథలు ఎంచుకుంటున్నానని సంకల్ప్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో చేయబోతున్న చిత్రం స్పేస్ నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు.

    English summary
    Director Sankalp Reddy reveals how Ghazi story was start. He faces many problems before
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X