»   »  అది..మురళీ మోహన్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌గా మారింది

అది..మురళీ మోహన్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌గా మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ‘మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీ వాతావరణం రాజకీయ ఎన్నికలను తలపిస్తోంది. ఆర్టిస్టులంతా వీరిద్దరి తరుపున రెండు గ్రూఫులుగా విడిపోయారు.

రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా..... మురళీ మోమన్ తను ఈ సారి మళ్లీ పోటీ చేయకుండా జయసుధను రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు ‘మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ పై పలువురు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

 Director Srinath criticized Murali Mohan

మురళీమోహన్ పై దర్శకుడు శ్రీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా అంటే మురళీమోహన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గా తయారు చేశారని ఆయన విమర్శించారు. ఆయన చాలా కాలం పాటు 'మా' అధ్యక్ష పదవిని నిర్వహించారని, చంద్రబాబు వద్ద పనిచేసినా కూడా.. 'మా' కోసం ఒక్క భవనం కూడా తీసుకురాలేకపోయారని శ్రీనాథ్ విమర్శించారు. అన్ని పదవులూ మురళీమోహనే అనుభవించాలనుకుంటున్నారని, బతికున్న లెజెండ్స్ ను మర్చిపోయి.. చనిపోయినవారి కోసం మృత్యుంజయ హోమం చేయించారని దర్శకుడు శ్రీనాథ్ అన్నారు.

English summary
Director Srinath criticized MAA president Murali Mohan.
Please Wait while comments are loading...