»   » ఆ డబ్బంతా... శ్రీను వైట్ల ఏం చేస్తున్నాడో తెలుసా?

ఆ డబ్బంతా... శ్రీను వైట్ల ఏం చేస్తున్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడంటే శ్రీను వైట్లకు బ్యాడ్ టైమ్ నడస్తుంది కానీ.... 'ఆగడు' సినిమా రిలీజ్ ముందు వరకు శ్రీను వైట్ల రేంజే వేరు. టాలీవుడ్ టాప్ 5 స్టార్ డైరెక్టర్ హోదా అనుభవించాడు. ఆగడు సినిమా భారీ ప్లాప్, ఆ వెంటనే బ్రూస్ లీ డిజాస్టర్ కావడంతో పరిస్థితులు తిరగబడటం, ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఇష్టపడక పోవడం తెలిసిందే.

'నీ కోసం' సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన శ్రీను వైట్ల ఆ తర్వాత వరుస సినిమాలు, వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ ఎదిగాడు. వంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో శ్రీను వైట్ల ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకునే స్థాయికి ఎదిగాడు. కోట్లు సంపాదించాడు.


ఆ డబ్బంతా ఇపుడు...

ఆ డబ్బంతా ఇపుడు...

దర్శకుడిగా తాను సంపాదించిన డబ్బుతో శ్రీను వైట్ల నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే సినిమా నిర్మాణం చేయాలనే సాహసం చేయడం లేదని, చిన్న స్థాయి పెట్టుబడులతో ఇప్పుడిప్పుడే నిర్మాతగా బుడి బుడి అడుగులు వేస్తున్నాడు.


బుల్లితెరపై పెట్టబుడి

బుల్లితెరపై పెట్టబుడి

యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన వైవా హర్ష తో బుల్లితెరపై ఓ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షో ద్వారా శ్రీను వైట్ల నిర్మాతగా మారుతున్నారని సమాచారం.


కామెడీనే సక్సెస్ మంత్రం

కామెడీనే సక్సెస్ మంత్రం

శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీనే తన సక్సెస్ మంత్ర. ఇపుడు బుల్లితెరపై కూడా దాన్నే ప్రయోగిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల ఇందుకు సంబంధించిన చర్చల్లో ఉన్నాడని, త్వరలోనే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని తెలుస్తోంది.


మిస్టర్

మిస్టర్

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్' మూవీ రేపు(ఏప్రిల్ 14)న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిజల్ట్ మీదనే దర్శకుడిగా శ్రీను వైట్ల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ సినిమా హిట్టయితేనే శ్రీను వైట్ల కెరీర్ మళ్లీ గాడిలో పడుతుంది.. లేదంటే అవకాశాలు రావడం మరింత కష్టమవుతుందని అంటున్నారు.


దీపం ఉండగానే...

దీపం ఉండగానే...

సినిమా రంగంలో దర్శకుడిగా సక్సెస్ రేటుతో ఎల్లకాలం కొనసాగడం అసాధ్యం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా తాను దర్శకుడిగా ఇండస్ట్రీలో ఉండగానే నిర్మాతగా బాటలు వేసుకుంటున్నాడు శ్రీను వైట్ల.


English summary
According to the latest buzz, Srinu Vaitla is all set to launch a comedy show with comedian Viva Harsha on a popular TV Channel. The official confirmation is awaited regarding it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu