»   » ఒకప్పుడు మేము రిచ్, ఆస్తులు పోయాయి: రాజమౌళి

ఒకప్పుడు మేము రిచ్, ఆస్తులు పోయాయి: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి డైరెక్టర్ రాజమౌళి 'శ్రీవల్లి' మూవీ ఆడియో వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది మరెవరో కాదు... ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ...మా నాన్న గారిని చూసి గర్వపడిన క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి. అందులో కొన్ని ఇపుడు చెబుతాను. మా తాతయ్య గారు చాలా ధనవంతులు, మా నాన్న, పెదనాన్న సిల్వర్ స్పూన్ తో పుట్టారు. తర్వాత కాలంలో ఆ డబ్బంతా హరించుకుపోయింది. 80ల్లో అంతా మద్రాసులో ఉండే వాళ్లం. రెండు గదుల ఇళ్లలో 14 మంది 15 మంది ఉండేవాళ్లం.
మా ఇన్ కం సోర్స్ పెద నాన్న, నాన్న కథలు రాసే వారు. చాలా సినిమాలకు గోస్ట్ రైటర్ గా ఉండేవారు. మా అందరికీ ఆ ఇద్దరి పేర్లు పేపర్లో ఎప్పుడు పడతాయి అని ఆతృతగా ఉండేది.

 సితారలో చూసి

సితారలో చూసి

శివశక్తి దత్తా, విజయేంద్రప్రసాద్ ఈ రెండు పేర్లు అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకి రాముడు సినిమాకి ఫస్ట్ టైం పేర్లు పడ్డాయి. అపుడు పక్కన ఊరికి వెళ్లి సితార కొని అందులో పేర్లు చూసి చాలా గర్వపడ్డాం అని రాజమౌళి తెలిపారు.

 నేను అబద్దాల కోరును

నేను అబద్దాల కోరును

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... రచయితకు సరికొత్త అర్థం చెప్పారు. బాగా అబద్దాలు ఆడగలిగిన వాడే రచయిత అవుతాడని, తనలో బాగా అబద్దాలు ఆడగలిగే నేర్పు ఉండటం వల్లే రచయితను అయ్యానని తెలిపారు.

 నాకు పెద్ద అబద్దల కోరు ఆమె

నాకు పెద్ద అబద్దల కోరు ఆమె

రెండేళ్ల క్రిందట వారం వ్యవధిలో బాముబలి, బజరంగీ బాయి జాన్ చిత్రాలు రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తర్వాత నాకంటే అబద్దాల కోరు లేడనుకున్నాను. కానీ నాకంటే అందంగా అబద్దలు చెప్పగలిగే వ్యక్తి మరికొరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు యాంకర్ సుమ. ఆడియో వేడుకలో బోలెడు అబద్దాలు ఆడుతుంది. అతిథులను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగుడుతుంది. సినిమాల గురించి లేనిపోని అబద్దాలు చెబుతుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

 ఆకట్టుకున్న ఘట్టం

ఆకట్టుకున్న ఘట్టం

శ్రీ వల్లి ఆడియో వేడుకలో తండ్రి షూ లేస్ ఊడిపోతే రాజమౌళి స్వయంగా ఆయన షూ లేస్ సరిచేసిన ఘటన ఆడియో వేడుకకు హాజరైన అందరినీ ఆకర్షించింది. ఎంత పెద్ద దర్శకుడు అయినా ఒక తండ్రికి కొడుకే అంటూ అంతా చర్చించుకున్నారు.

English summary
Director SS Rajamouli speech about his father Vijayendra Prasad. Director SS Rajamouli’s father Vijayendra Prasad, the writer of movies like Baahubali and Bajrangi Bhaijaan, turned director for a scientific thriller named Srivalli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu