»   » రాజమౌళి నెక్ట్స్ సినిమా ఇదే.. నిర్మాత ఎవరంటే..

రాజమౌళి నెక్ట్స్ సినిమా ఇదే.. నిర్మాత ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనది ఇప్పుడు సినీ అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అందించిన ఆయన ఎవరితో సినిమా రూపొందించబోతున్నారు? హీరో, హీరోయిన్లు ఎవరు? నిర్మాత ఎవరు అనే ప్రశ్నలకు సంబంధించిన ఊహాగానాలు మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం.

బాహుబలికి ముందే..

బాహుబలికి ముందే..

బాహుబలి2 విడుదలకు ముందే ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నుంచి దర్శకుడు రాజమౌళి అడ్వాన్స్‌ తీసుకొన్నారనేది అప్పట్లో టాక్. ప్రస్తుతం రాజమౌళి డీవీవీ దానయ్యకే సినిమాను చేయనున్నట్టు వార్త ప్రచారంలో ఉంది. బాహుబలి2కి ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ సినిమాను రాజమౌళి చేస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.

త్వరలోనే నటీనటుల

త్వరలోనే నటీనటుల

ప్రస్తుతం నిర్మాత గురించి వార్త వెలుగులోకి రాగానే రాజమౌళి తీయబోయే సినిమా కథ ఏంటీ, హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. త్వరలోనే నటీనటులు ఎంపిక వివరాలను వెల్లడించి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2

ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇప్పటికే బాహుబలి రూ.1575 కోట్లకు పైగా వసూలు చేసింది. భారతీయ సినిమా పరిశ్రమలో దేశీయ రికార్డులను తిరగరాసింది. రూ.2000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది.

చైనాలో బాహుబలి2

చైనాలో బాహుబలి2

ప్రపంచ ఆదరణను చూరగొన్న బాహుబలి2 సినిమాను చైనాలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే రిలీజ్ డేట్‌ను ఫైనలైజ్ చేయలేదు. విడుదల తేదీలను ఖారారు చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ప్రస్తుతం దంగల్ చిత్రం చైనాలో ప్రభంజనాన్ని కొనసాగిస్తూ రూ.800 కోట్లు వసూలు చేసింది.

English summary
Director SS Rajamouli's next project is with Producer DVV Danayya. Cast will be announced soon. Apart from this, The makers of Baahubali: The Conclusion are prepping for the release of the S S Rajamouli-directed film in the country, trade analyst Taran Adarsh tweeted on Thursday. "No specific release date has been finalised yet. However, makers are looking at an earliest date possible," he tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu