»   » ఎన్టీఆర్ అసలు మాసే కాదంటున్న సుకుమార్

ఎన్టీఆర్ అసలు మాసే కాదంటున్న సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్లాస్, మాస్ అంశాలపై ‘నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకలో ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు దర్శకుడు సుకుమార్. నేను అందరికీ క్లాస్ డైరెక్టర్ మారిరి కనిపిస్తాను. ఎన్టీఆర్‌ అందరికీ మాస్ హీరోలా కనిపిస్తాడు. అతని సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే.

నేను పైకి క్లాస్ డైరెక్టర్లా కనిపించినా.... నా ఆలోచనలు చాలా మాస్ గా ఉంటాయి. అదే సమయంలో ఎన్టీఆర్ పైకి కనిపించేంత మాస్ కాదు. వ్యక్తిగతంగా చాలా క్లాస్. గదిలోకి వెళ్లామంటే అత్యంత మెలోడీ పాటలే వినిపిస్తాయి. ఆ మెలోడీ సాంగ్స్ అతను అద్భుతంగా పాడతాడు. తను పాడుతుంటే వింటూ ఉండిపోతాం. ఒక ఆల్బంలో అన్ని పాటలూ పాడగల హీరో ఎన్టీఆర్ ఒక్కడే.


Director Sukumar about NTR

నాన్నకు ప్రేమతో టైటిల్ డిజైన్ చేసి బయటికి వదిలాక అందరూ అందులో కనిపించే ‘హార్ట్ బీట్' డిజైన్ చాలా బాగుందన్నారు. ఏం టచ్ ఇచ్చారు సార్ అని మెసేజ్ లు పెట్టారు. ఐతే ఆ టైటిల్ డిజైన్ తారక్ ఆలోచన. ఎన్టీఆర్ చాలా కాస్ల్ అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని వ్యాఖ్యానించారు సుకుమార్.


ఎన్టీఆర్ ఎంత మంచి నటుడు. చాలా సింప్లిసిటీ ఉన్న హీరో. షూటింగ్ జరుగుతుంటే వెళ్లి మూలన స్టెప్స్ మీద మామూలుగా కూర్చునేవాడు. మరీ ఇంత సింపుల్ గా ఉండటమేంటి.. డ్రెస్ పాడైపోతుంది అని చెప్పేవాణ్ని ఇలాంటి హీరోను నేను ఇప్పటి వరకు చూడలేదు అని సుకుమార్ చెప్పుకొచ్చారు.

English summary
Director Sukumar says about NTR "When I enter his room, he always keeps listening to melody songs. He just sings them too. Looking at the way he simply manages to sit even on a nearby side ramp during shootings, I can say how simple he is. At heart, he's a very class".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu