twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు పుట్టలేదు.. ఇండస్ట్రీ నావల్లే నడుస్తుందని కొందరికి ఇగో.. తేజ

    |

    టాలీవుడ్ పరిశ్రమ కరోనా పరిస్థితుల సమయంలో కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్నది. షూటింగులు, సినిమా హాళ్ల ప్రదర్శనల గురించి టాలీవుడ్‌లోని ప్రముఖులు చర్చలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కొందరు చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దాసరి లాంటి పెద్ద దిక్కు పరిశ్రమకు అవసరం ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది. తాజాగా చిరంజీవి పెద్దరికంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో చోటుచేసుకొన్న వివాదంపై స్పందిస్తూ..

    ఎవడైనా నాకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల్సిందే..బాలయ్య కౌంటర్ఎవడైనా నాకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల్సిందే..బాలయ్య కౌంటర్

    నన్ను పిలువలేదు.. ఎందుకంటే

    నన్ను పిలువలేదు.. ఎందుకంటే

    రాష్ట్ర ప్రభుత్వాలతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు నాకు సమాచారం లేదు. నన్ను పిలువాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సూపర్ హిట్ డైరెక్టర్ అయితే పిలిచేవాళ్లు. కానీ నాకు ఇప్పుడు ఆ హోదా లేదు. అందుకే వాళ్లు పిలువలేదు. కానీ ప్రతీ ఒక్కరిని చర్చలకు పిలువాలి. ఇండస్ట్రీ కోసం పాటుపడే వారికి కనీసం సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని దర్శకుడు తేజ అన్నారు.

    రెండుగా చీలిపోయిందంటే ఒప్పుకోను

    రెండుగా చీలిపోయిందంటే ఒప్పుకోను

    బాలకృష్ణ, నాగబాబు వివాదంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందంటే నేను ఒప్పుకొను. ఎందుకంటే ఎన్టీఆర్, ఎస్వీఆర్ షూటింగులకు వచ్చేటప్పటి నుంచి నేను చూస్తున్నాను. వాళ్లు లేకపోయినా ఇండస్ట్రీ నడస్తున్నది. ఇండస్ట్రీ నా వల్లే నడుస్తుందని కొందరు అనుకొంటారు. ఇండస్ట్రీ శాశ్వతం. ఎవరు ఉన్నా లేకపోయినా నడస్తుంది.. ముందుకు పోతున్నది.

     గొప్పవాళ్లు లేకపోయినా పరిశ్రమ ముందుకు

    గొప్పవాళ్లు లేకపోయినా పరిశ్రమ ముందుకు

    ఇండస్ట్రీలో మధ్యలో కొందరు వస్తుంటారు. కొందరు పోతుంటారు. ఎన్టీఆర్ లాంటి లేకపోయినా ఇండస్ట్రీ ఎలాంటి నష్టం జరుగలేదు. గొప్ప డైరక్టర్లు ఎంఎస్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి, బాపు,లాంటి లేకపోయినా పరిశ్రమ ముందుకు పోతున్నది. రాఘవేంద్రరావు, కే విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారు. ఇలాంటి వాళ్లకు గొప్ప హోదా ఉంది. ఇండస్ట్రీ కోసం ఏదైనా చర్చలు జరుపాల్సి వస్తే.. సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అని తేజ అభిప్రాయపడ్డారు.

    బాలకృష్ణను పిలువాలి

    బాలకృష్ణను పిలువాలి

    ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మీటింగ్ పెట్టుకొంటే పరిశ్రమకు సంబంధించిన అందర్నీ పిలువాలి. అటు చిరంజీవిని పిలువాలి, ఇటు బాలకృష్ణను పిలువాలి. ఇగోలు, నన్ను పిలిచారు, నన్ను పిలువలేదు అనే మాట రావొద్దు. ఇండస్ట్రీ పని అనుకొని పిలిచారా? పర్సనల్ పని అనుకొని సీఎంలను కలిశారా? అనేది నాకు అంతు పట్టడం లేదు. ఇండస్ట్రీ కోసమైతే అందర్నీ పిలువాల్సిన అవసరం ఉంది అని తేజ అన్నారు.

    దాసరి సింహంలాంటి వారు.. ఫోన్‌లోనే అంతా

    దాసరి సింహంలాంటి వారు.. ఫోన్‌లోనే అంతా

    కరోనావైరస్ పరిస్థితులను చూస్తే దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన సింహం లాంటి వాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేది. ఆయన లేని లోటు కనిపిస్తున్నది. దాసరి గారి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉండాలి. అయితే దాసరి ఉన్న రోజుల్లో లైట్ బాయ్ కూడా వెళ్లి తన సమస్యను చెప్పుకొనే వాడు. దానికి దాసరి స్పందించేవారు. సమస్య పరిష్కారం అయ్యేది అని తేజ అన్నారు.

    Recommended Video

    Ravi Teja & Sai Dharam Tej To Team Up For Multi-Starrer
    దాసరిని చూస్తే కాళ్ల మీద పడాలని

    దాసరిని చూస్తే కాళ్ల మీద పడాలని

    దాసరి గారిని చూస్తే కాళ్ల మీద పడాలనే కోరిక కలిగేది. ఏదైనా సమస్య వస్తే సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రధానితో కేవలం ఫోన్‌లోనే మాట్లాడగలిగే వారు. అలాంటి వ్యక్తులు పుట్టాలి. నేను ఏదో పేరు చెబితే సరికాదు. ఇండస్ట్రీ అంతా ఓ వ్యక్తిని అంగీకరించాలి. అలాంటి వ్యక్తే ఇండస్ట్రీకి పెద్దగా అవుతారు అని తేజ అన్నారు. చిరంజీవి లాంటి వాళ్లు ఇండస్ట్రీ పెద్దగా ఉండటానికి అర్హత లేదని తేజ పరోక్షంగా కామెంట్ చేశారు.

    English summary
    Director Teja serious comments on late director Dasari Narayanarao. He said, Its impossible to fill his place with Chiranjeevi or Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X