»   » నీతులు చెప్పడం కాదు, చేసి చూపించండి.. జరిగిందంతా శ్రీరెడ్డి చెప్పింది, తేజ షాకింగ్ కామెంట్స్!

నీతులు చెప్పడం కాదు, చేసి చూపించండి.. జరిగిందంతా శ్రీరెడ్డి చెప్పింది, తేజ షాకింగ్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
Teja Supports Sri Reddy On Behalf Of Her Interviews

ప్రస్తుతం విడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీ చూపు మొత్తం ఆమె వైపు మళ్లింది. తనని సినీ ప్రముఖులు కొందరు ఈ విధంగా వాడుకుని వదిలేశారో శ్రీరెడ్డి దైర్యంగా బయట పెట్టడంతో ఈ విషయం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శ్రీరెడ్డి వైఖరికి ఇండస్ట్రీలో కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా స్టార్ డైరెక్టర్ తేజ ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. శ్రీరెడ్డికి వాదనకు మద్దత్తు ప్రకటించి సంచనలం సృష్టించారు.

 మీడియాలో శ్రీరెడ్డి గోల

మీడియాలో శ్రీరెడ్డి గోల

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి నటీమణులు కొందరు ఈ విషయం గురించి తమవంతుగా గళం విప్పుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వాడుకుని వదిలేశారంటూ కామెంట్స్

వాడుకుని వదిలేశారంటూ కామెంట్స్

తనని అవకాశాల పేరుతో సినీ ప్రముఖులు కొందరు వాడుకుని వదిలేశారని శ్రీరెడ్డి మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కామెంట్స్ పై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 పాపులారిటీ కోసం అంటూ ప్రచారం

పాపులారిటీ కోసం అంటూ ప్రచారం

శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్ కేవలం పాపులారిటీ కోసం మాత్రమే అని కొందరు కొట్టిపారేశారు. ఈతరహా ఘటనలు ప్రతి రంగంలోనూ జరుగుతుంటాయని కానీ శ్రీరెడ్డి దీనిపై అతిగా స్పందిస్తోందంటూ కామెంట్స్ చేసే వారు లేకపోలేదు.

దర్శకుడు తేజ భిన్నంగా

దర్శకుడు తేజ భిన్నంగా

అందరిని షాక్ కి గురిచేస్తూ దర్శకుడు తేజ శ్రీరెడ్డికి తన సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం తెలుసుకుని చాలా భాద పడ్డా అని తేజ వ్యాఖ్యానించడం విశేషం.

వెతికి మరీ పట్టుకున్నా

వెతికి మరీ పట్టుకున్నా

శ్రీరెడ్డి గురించి గత కొంతకాలంగా మీడియాలో వస్తున్న వార్తలని చూస్తున్నానని తేజ వ్యాఖ్యానించారు. జరిగిన విషయం తెలుసుకునేందుకు ఆమెని వెతికి మరి పట్టుకున్నా అని తేజ అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీరెడ్డి నాకు వివరించింది. చాలా భాదగా అనిపించింది అని తేజ అన్నారు.

రెండు సినిమాల్లో అవకాశాలు

రెండు సినిమాల్లో అవకాశాలు

మన ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి ఇలా కష్టాల్లో ఉండడం సరికాదని, అందుకే తనరెండు చిత్రాల్లో ఆమెకు మంచి పాత్రలు ఇచ్చానని తేజ అన్నారు.

నీతులు చెప్పడం కాదు

నీతులు చెప్పడం కాదు

ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరు నీతులు చెప్పడం కాదు. ఇలా కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులని ఆదుకుని చూపించండి అంటూ తేజ హితవు పలికారు.

వారంతా మాట నిలబెట్టుకోవాలి

వారంతా మాట నిలబెట్టుకోవాలి

తనకు సినిమా వేషాలు ఇస్తానని మాట ఇచ్చి చాలా మంది ఆమెని వాడుకుని వదిలేశారు. వారంతా మాట నిలబెట్టుకోవాలని తేజ అన్నారు. శ్రీరెడ్డి ఎలాంటి అమ్మాయి అని చర్చించుకోవడం కాదు.. ఆమెకు న్యాయం చేయడం ముఖ్యం అని తేజ అన్నారు.

English summary
Director Teja supports Srireddy. Teja gives movie chance to Srireddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X