twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దెబ్బతిన్న పులి పవన్ అంటున్న దర్శకుడు

    By Srikanya
    |

    తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ... ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ కథానాయకునిగా నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తున్న చిత్రం పంజా .

    పవన్ కళ్యాణ్, అడవి శేషు, అంజలీ మీద ఓ పబ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో బెల్లీ డాన్స్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ పాట పూర్తైన తర్వాత ఆడియోకి డేట్ ఫిక్స్ చేస్తారు. బిల్లా వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ఫస్ట్‌లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్ర పేరును పవన్ ఫిక్స్ చేసారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు.నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ..పవన్‌ ఇమేజ్‌ దృష్ట్యా పవర్‌ఫుల్‌ టైటిల్‌ నిర్ణయించాం. కోల్‌కత నేపథ్యంలోని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. న్యూలుక్‌ ఉన్న సినిమా. క్రిష్‌, త్రీఇడియట్స్‌..చిత్రాలకు స్టంట్స్‌ కూర్చిన శ్యామ్‌ కౌశల్‌ అద్భుత యాక్షన్‌నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి అన్నారు.

    ఇక ఈ చిత్రం ఒక పాట మినహా సినిమా పూర్తయిందని, పవర్‌స్టార్ అభిమానులకే కాక, ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆనందాన్ని పంచుతుందని విష్ణు వర్దన్ అన్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.

    English summary
    Pawan’s Panja release date has been planned for December 9 while Panja audio songs release function will be in November it seems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X