»   » ఈడియట్, నువ్వు అసలు జర్నలిస్ట్ వే కాదు.. : మండిపడ్డ దర్శకుడు వియన్ ఆదిత్య

ఈడియట్, నువ్వు అసలు జర్నలిస్ట్ వే కాదు.. : మండిపడ్డ దర్శకుడు వియన్ ఆదిత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలి చిత్రం 'మనసంతా నువ్వే' తో పరిచయం అయి, సంచలనమైన హిట్ ఇచ్చిన దర్శకుడు వియన్ ఆదిత్య. ఆ తర్వాత చేసిన చిత్రాలలో కొన్ని ఆడలేదు. ఇప్పుడు ఆయన తిరిగి రీ ఎంట్రీ ఇవ్వటం కోసం కథ రాసుకుంటూ యుఎస్ లో ఉన్నారు.

అయితే తాజాగా ఈ దర్శకుడుపై ఓ న్యూస్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చచింది. ఆయన తన కుటుంబాన్ని వదిలేసి అమెరికా వెళ్లిపోయారంటూ వార్త వచ్చింది. దాంతో ఆయన ఈ జర్నలిస్ట్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.


' నా సోదరుడు సతీష్ స్నేహితుడుగా నీకు గౌరవం ఇస్తాను. అలాగే నీకు ఇష్టం వచ్చినట్లుగా రాసేందుకు హక్కుందని నాకు తెలుసు. నీకు అవసరమైనప్పుడల్లా నా నుంచి సాయం పొందావ్. ఇప్పుడు నువ్వేంటో, నీ అసలు రంగు ఏంటో చూపించావ్. ఈడియట్.. వేరే వారి జీవితంపై బురద జల్లడం మానేయ్. ఇవాల్టి నుంచి నువ్వసలు జర్నలిస్టువే కాదు' అన్నారు.

'స్కైప్ కాల్ మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకుని.. పబ్లిక్ లో ఫైట్ చెయ్. మా కుటుంబం అంతా సీనియర్ జర్నలిస్టులే. నా కుటుంబం గురించి నీకేం తెలుసు. నాలో వేరే యాంగిల్ ని కదపద్దు. నాకెపుడూ సాయం చేయని వాళ్లకి నేనేంటో ప్రూవ్ చేయాల్సిన పని లేదు. పెన్ను సరిగ్గా వాడు. నీ దిక్కు మాలిన రాతలకు తగిన ఫలితం అనుభవించేందుకు సిద్ధంగా ఉండు' అంటూ విరుచుకుపడ్డారు వీఎన్ ఆదిత్య..

అలాగే 'కవర్ లో డబ్బులు తీసుకుని సినిమాని ప్రమోట్ చేసే నీకేం తెలుస్తుంది క్రియేటర్ విలువ.. వాడి జీవితం గురించి' అన్నారు.

అలాగే కెరీర్ ప్రారంభ దశలో మనసంతా నువ్వే వంటి హిట్టు సాధించిన ఆయన ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఈ విషయంపై ఆయన గతంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఓ పద్దతి ప్రకారం జరగాలనుకునే వ్యక్తిని నేను.

మనసంతా నువ్వే తర్వాత దాదాపు ఇరవై మంది నిర్మాతలు నన్ను సినిమా చేసి పెట్టమని అడిగారు. అడ్వాన్స్ లు చేతిలో పెట్టబోయారు. అడ్వాన్స్ లు ఇచ్చారని కమిటైపోయి నేను సినిమాలు చేయలేను.నా మనస్సుకు నచ్చినప్పుడు తీస్తాననే వాడిని. అలా ఎవరి దగ్గరా అడ్వాన్స్ లు తీసుకోలేదు అన్నారు.

English summary
VN Aditya, furious on baseless rumors has lashed out at the journalist who reported the fake news and also requested the media to put a stop to such articles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu