»   » అజ్మీర్ దర్గా కు వెళ్లిన వివినాయిక్ (ఫొటో)

అజ్మీర్ దర్గా కు వెళ్లిన వివినాయిక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొంది రిలీజ్ కు దగ్గరవుతున్న చిత్రం అఖిల్. ఈ చిత్రం దీపావళి కానుకగా 11, నవంబర్ 15న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో వివి. వినాయిక్ చిత్రం విజయం కోసం అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చారు.

ఈ చిత్రం సెన్సార్‌ పూరైంది. యూ/ఏ ధృవీకరణ పత్రం లభించినట్లు చిత్ర నిర్మాత నితిన్‌ తన అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా వెల్లడించారు. శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే.


Director VV Vinayak in Azmeer Darga

నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ ''అఖిల్‌ హీరోగా నటించిన తొలి చిత్రమిది. అందుకే సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి దీటుగా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అఖిల్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ అందించిన గీతాలకి మంచి ఆదరణ లభించింది. సినిమా అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతుంది. మా నిర్మాణ సంస్థకి మరపురాని చిత్రంగా 'అఖిల్‌' నిలుస్తుంది''అన్నారు.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil and Sayeesha Saighal’s Dream Debut Akhil The Power Of jua was releasing grandly on the eve of Diwali, 11th Nov,15. Director of this prestigious project, V V Vinayak visited the world famous and holy Ajmer Dargah for the blessings of Akhil The Power Of Jua from the Almighty.
Please Wait while comments are loading...