twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'అరవింద సమేత'కు షాక్.. టిఆర్పి రేటింగ్ ఎంతో తెలుసా!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అరవింద సమేత మంచి విజయం సాధించింది. గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యాక్షన్ డ్రామా ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్, యాక్షన్ ఎపిసోడ్స్, రాయలసీమ బ్యాక్ డ్రాప్, విలన్ గా జగపతి బాబు నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. తమన్ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇటీవల ఈ చిత్ర ప్రీమియర్ బుల్లితెరపై టెలికాస్ట్ అయింది. ఈ చిత్రానికి నమోదైన టిఆర్పి రేటింగ్స్ ఆశాజనకంగా లేవు.

    ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు

    ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు

    అరవింద సమేత చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోమారు తన మ్యాజిక్ ని చూపించారు. ఫ్యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తన నటనతో ఈ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్ళాడు. యాక్షన్స్ ఎపిసోడ్స్, సిక్స్ ప్యాక్ లుక్ తో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకున్నారు. తమన్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయింది. అరవింద సమేత చిత్రం 90 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది.

    బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!

    బుల్లితెరపై నిరాశ

    బుల్లితెరపై నిరాశ

    అరవింద సమేత చిత్రాన్ని ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించారు. జీ తెలుగు ఛానల్ లో అరవింద సమేత టెలికాస్ట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 13.7 టిఆర్పి రేటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇది నిరసపరిచే నంబర్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రాలకు మంచి టిఆర్పి రేటింగ్స్ నమోదవుతుంటాయి. కానీ అరవింద సమేత చిత్రానికి ఆలా జరగలేదు.

     మిగిలిన చిత్రాలు

    మిగిలిన చిత్రాలు

    అరవింద సమేత చిత్రంతో పాటు ప్రదర్శించబడిన మిగిలిన చిత్రాల టిఆర్పి రేటింగ్స్ ఇలా ఉన్నాయి. మీడియం రేంజ్ చిత్రంగా వచ్చిన హలొ గురు ప్రేమ కోసమే చిత్రం 8.7, తొలిప్రేమ 6.2, పందెం కోడి 2కి 5.5, అమర్ అక్బర్ ఆంటోని చిత్రానికి అతితక్కువగా 3.2 రేటింగ్ నమోదైంది. విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం రెండవసారి కూడా అదరగొట్టేసింది. ఈ చిత్రానికి తొలిసారి 20 రేటింగ్ నమోదు కాగా, రెండవసారి ప్రదర్శించినప్పుడు టిఆర్పి రేటింగ్ 17గా నమోదైంది.

    కారణం ఇదేనా

    కారణం ఇదేనా

    గత ఏడాది విడుదలైన రంగస్థలం చిత్రాన్ని 19.5, భరత్ అనే నేను చిత్రానికి 14.6 రేటింగ్ నమోదైంది. అరవింద సమేత చిత్రానికి తక్కువ టిఆర్పి రేటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం కామెడీ లేకపోవడం అని అంటున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి డిజిటల్ ఫార్మట్స్ లో సినిమాలు ముందుగా వచేస్తున్నాయి. ఇవి కూడా సినిమాలకు టిఆర్పి రెంటింగ్ తగ్గడానికి కారణం అవుతున్నాయి. కానీ అరవింద సమేత చిత్రం ఇంతవరకు ఏ డిజిటల్ ఫార్మాట్ లోనూ రాలేదు.

    English summary
    Disappointing TRP ratings for Trivikram, NTR Aravinda Sametha movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X