»   » చిరంజీవితో బంగారు కోడిపెట్ట సాంగ్, నడుమ్మీద చెయ్యేసాడు ఈడ్చికొట్టాను

చిరంజీవితో బంగారు కోడిపెట్ట సాంగ్, నడుమ్మీద చెయ్యేసాడు ఈడ్చికొట్టాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిస్కో శాంతి 1980 ల్లో స్పెషల్ సాంగ్ కోసం ఖచ్చితంగా కనిపించే తార డిస్కో శాంతి. క్రమేణా ఆ తరహా పాటల కోసం హీరోయిన్లే రెడీ అయిపోవటం, కొత్త తారలు వచ్చేయటం తో పాటు నటుడు శ్రీహరి తో వివాహం పిల్లలూ వచ్చిన తర్వాత నెమ్మదిగా తెరమీద ఆ తరహా పాటలు తగ్గించుకుంది శాంతి. ఆ తర్వాత తెరమీద కనిపించటమే మానేసి గృహిణి గా తన భాధ్యతలు నెరవేరుస్తూ ఉండిపోయింది.

Disco Shanthi About Bangaru Kodipetta Song Shooting

శ్రీహరి మరణం తర్వాత మీడియా కు మరింత దూరం వెళ్ళిపోయింది. అయితే ఒకప్పుడు డిస్కోశాంతి అంటే ఒక ఫైర్ బ్రాండ్, సెట్స్ మీద కూడా అంతే ధైర్యంగా కనిపించే శాంతి. ఆమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంఘటన ఆమె ఎంత డేరింగో చెబుతుంది.

చిరంజీవి హీరోగా వచ్చిన ఘరాణామొగుడు సినిమా లో బంగారు కోడిపెట్ట ఎంత హిట్ సాంగో మనకు తెలిసిందే. ఆ పాట షూటింగ్ విశాఖ హార్బర్లో జరిగింది. అదే పాటలో చిరు తో పాటు నర్తించింది శాంతి. ఈ షూటింగ్ చూడటానికి వైజాగ్ వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా కొన్ని వందలమంది అక్కడికి చేరుకున్నారు.

Disco Shanthi About Bangaru Kodipetta Song Shooting

ఆ పాట చేస్తున్న సమయం లోనే ఒక షాట్ గ్యాప్ లో నడుచుకుంటూ వెల్తున్న శాంతి కి దగ్గర గా వచ్చిన గుంపులో ఒకడు ఆమె నడుం మీద చెయ్యివెయ్యబోయాడట అదే చెయ్యి పట్టుకుని ముందుకు లాగిన శాంతి అతన్ని అక్కడే చితక్కొట్టిందట. అక్కడే ఊన చిరంజీవీ, అదే సినిమా దర్శకుడైన రాఘవేంద్ర రావు వచ్చి ఆపే వరకూ కొడుతూనే ఉందట. అంత ధైర్యం చూపిన డిస్కో శాంతి శ్రీహరి మరణం తర్వాత మాత్రం విపరీతంగా కుంగిపోయింది. అయితే తన ఇద్దరు కొడుకులను మాత్రం ఇండస్ట్రీలోనే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదట.

English summary
Disco Shanti is an Indian film actress and an "item song dancer" who worked predominantly in South Indian cinema. Shared a insident while she Doing "Bangaru KodipeTTa" song with chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu