»   » వీళ్లేం ప్యాన్స్?? ‘లోఫర్‌’ హీరోయిన్ ని లాగి దురుసుగా, గాయాలు

వీళ్లేం ప్యాన్స్?? ‘లోఫర్‌’ హీరోయిన్ ని లాగి దురుసుగా, గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందిన 'లోఫర్‌'చిత్రం హీరోయిన్ దిశా పటానీ గుర్తుండే ఉండి ఉంటుంది. రీసెంట్ గా ఎమ్ ధోని ది టోల్డ్ స్టోరీలో నటించిన ఆమెకు హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది.

ఓ జువెలరీ స్టోర్‌ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె వూహించని పరిణామంతో షాక్‌ తిన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చిన దిశాను చూసిన అభిమానులు ఆమెను చుట్టుముట్టేశారు.అంతలోనే వూహించని పరిణామం దిశాకు ఎదురైంది.

Disha Patani mobbed in Hyderabad

కారు నుంచి దిగి షోరూంలోకి వెళుతున్న దిశా చేతిని రౌడీ ఫ్యాన్స్ కొందరు లాగి దురుసుగా వ్యవహరించారు. దీంతో.. ఆమె చేతికి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. చేతికి అయిన గాయాన్ని పెద్దగా పట్టించుకోని దిశా.. తనని చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ స్టోర్‌ లోపలకు వెళ్లిపోయారు.

English summary
Actress Disha Patani had a harrowing time when she landed in Hyderabad to attend a store opening recently.Few rowdy fans let loose and started creating havoc by pulling Disha and trying to grab her. Despite the security, Disha ended by sustaining few injuries on her hand and back due to the jumble.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu