For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GodFather: క్యాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి బ్యూటీ దివి కామెంట్స్.. అలా కమిట్ అయితే తప్పేంటీ అంటూ షాకింగ్ గా..

  |

  కెరీర్ ఆరంభంలోనే పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది తెలుగు బ్యూటీ దివి వాద్యా. కానీ, బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో పాటు తన అందంతో ఎంతో మందిని మాయ చేసిన ఈ భామ.. షోలో గెలవకున్నా ఫాలోయింగ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మూడు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి సినీ పెద్దలనే విస్మయానికి గురి చేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించి హిట్ కొట్టిన గాడ్ ఫాదర్ మూవీ ఒకటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయలా వెల్లడించింది ఈ బ్యూటీ.

  ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా..

  ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా..

  ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగల టాలెంట్ ఉన్న అమ్మాయి దివి వాద్యా. ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.

  మహేశ్ బాబుతో మహర్షి సినిమాలో..

  మహేశ్ బాబుతో మహర్షి సినిమాలో..

  మహేశ్ బాబుతో సినిమా చేసిన తర్వాత దివి వాద్యా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుని నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

  అసాధారణ ఆటతీరుతో..

  అసాధారణ ఆటతీరుతో..

  ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లోకి వచ్చిన దివి.. అసాధారణ ఆటతీరుతో అదరగొట్టింది. దీంతో ఆమె టాప్-5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ముందే ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, షో నిర్వహకులపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

  దివికి చిరంజీవి ప్రామీస్..

  దివికి చిరంజీవి ప్రామీస్..

  బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన రాబోయే సినిమా (వేదాళం రీమేక్)లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ సినిమా సంగతి పక్కన పెడితే ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన గాడ్ ఫాదర్ మూవీలో ఒక డీగ్లామర్ రోల్ లో దివి వాద్యాకు అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ మూవీతో దివి మరింత పాపులర్ అయిపోయింది.

   మమ్మల్ని అడగలేదని ఎవరైనా..

  మమ్మల్ని అడగలేదని ఎవరైనా..

  అయితే తాజాగా దివి వాద్యా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ''కమిట్ మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మమ్మల్ని అడగలేదని ఎవరైనా అంటే పెద్ద నిజం కాదు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి కెరియర్ లో ఎదగాలి అని ఉంటుంది. వారు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. అడగ్గానే లొంగిపోతారు.

  అది పెద్ద తప్పు కాదు..

  అది పెద్ద తప్పు కాదు..

  మరికొందరు ఆ పని చేయటానికి మనసొప్పక సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే నా దృష్టిలో అది పెద్ద తప్పు కాదు. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం పెద్ద తప్పు అని షాకింగ్ గా చెప్పుకొచ్చింది'' దివి వాద్యా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఇటీవల మా నీళ్ల ట్యాంక్, పరంపర సీజన్ 2 వెబ్ సిరీస్ లలోనూ దివి వాద్యా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 4rth Season Contestant And Chiranjeevi Starrer GodFather Actress Divi Vadthya Comments On Casting Couch In Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X