»   » డిజే వివాదం: తగ్గిన హరీష్ శంకర్, పదాలను తొలగిస్తామని హామీ!

డిజే వివాదం: తగ్గిన హరీష్ శంకర్, పదాలను తొలగిస్తామని హామీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డిజే పాట వివాదంలో నిన్న మొన్నటి వరకు ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్.... తాజాగా ఓ మొట్టు దిగాడు. ఈ పాట‌లో ఉప‌యోగించిన‌ అగ్ర‌హారం, త‌మల‌పాకు అనే ప‌దాలను తొల‌గించాల్సిందేన‌ని బ్రాహ్మ‌ణ సంఘాల ప్ర‌తినిధులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆయా ప‌దాల‌ను తొలగిస్తామ‌ని హరీష్ చెప్పారు.

దీంతో పాటు పాటలో వచ్చే 'నమక చమకాలు', 'ప్రవర', 'అగ్రహారం'తో పాటు అన్ని పదాలను తొలగిస్తామని ఆ పాట రచయిత సాహితి మీడియాకు తెలిపారు. బ్రాహ్మణ సంఘం నేతలు ఈ వివాదంపై స్వయంగా వెళ్లి హరీష్ శంకర్‌, సాహితిలను కలిసి మాట్లాడటంతో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది.


దీనికంటే ముందు... హరీష్ శంకర్ ఈ వివాదంపై క్రింది విధంగా స్పందించారు.


అందుకే అలా పోల్చాం

అందుకే అలా పోల్చాం

పాటలో ఆ పదాలు వాడటంపై హరీష్ శంకర్ స్పందిస్తూ.... అగ్రహారంలో ఉండే తమళపాకు అభిషేకాలకు, పూజలకు వాడతారు... పవిత్రంగా, కొత్తగా ఉంటుంది, వాడిన తమళపాకును మళ్లీ పూజకు వాడరు. ఈ ప్రేమ అనే ఫీలింగ్ కొత్తగా ఉంది అని చెప్పడంలో భాగంగా ఓ బ్రాహ్మణ కుర్రాడు అగ్రహారం తమిళపాకు అంటాడే తప్ప ఈ తమకం... చికెన్ ముక్కలా ఉందని అనడు... అనకూడదు. కేవలం లిరిక్ ను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎక్కడో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందనుకుంటున్నానే తప్ప మా మీద గానీ, మా సినిమా మీద గానీ కోపం ఉందని అనుకోవడం లేదు... అని హరీష్ శంకర్ అన్నారు.


అవమానించాలని ఎవరూ తీయరు

అవమానించాలని ఎవరూ తీయరు

60 నుండి 70 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అంతా స్క్రిప్టు మీద కూర్చుని కేవలం ఒక సామాజిక వర్గాన్ని కించ పరుద్దామని సినిమాలు ఎవరూ తీయరు. నేనైతే అస్సలు తీయను.... అని హరీష్ శంకర్ అన్నారు.


ప్రశంసలు వచ్చాయి

ప్రశంసలు వచ్చాయి

తెలుగు పాటల్లో తెలుగుదనం లేదు, అన్నీ ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు వస్తున్నాయని చాలా మంది విమర్శిస్తుంటారు. యూట్యూబ్ లో ఈ పాటకు ఎక్కడలేని ప్రశంసలు వచ్చాయి. చాలా మంది బ్రాహ్మణులు ఆ పాట అద్భుతం అని రాసిన మెసేజ్‌లు సేవ్ చేసి పెట్టాను. లిరిక్స్ ఎక్స్‌ట్రార్డినరీ అనే ప్రశంసలు వచ్చాయి. సౌతిండియాలో 5 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది. ఎవరికీ నచ్చకుండా పాట ఇంత పెద్ద హిట్టవ్వదు. లిరిక్ లోని అర్ధాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్లే ఇలా అభ్యంతరం తెలుపుతున్నారు... సమయం, సందర్భం వచ్చినపుడు వారికి వివరణ ఇస్తాం అని హరీష్ శంకర్ రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


‘డిజె' ట్రైలర్ సంచలనం... ఇంతలోనే భారీ రెస్పాన్స్, డిస్ లైక్స్ కూడా!

‘డిజె' ట్రైలర్ సంచలనం... ఇంతలోనే భారీ రెస్పాన్స్, డిస్ లైక్స్ కూడా!

12 గంటల్లో 2.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 87 వేలకు పైగా లైక్స్, 28 వేలకు పైగా డిస్ లైక్స్ సొంతం చేసుకుంది.... డిస్ లైక్స్ వెనక ఓ హీరో అభిమానులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
DJ controversial song lyrics to be edited. Director Harish Shankar had a meeting with the members of Brahmin Association. Everyone seems to have come to an agreement to remove few words from lyrics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu