»   » నువ్వెవడివిరా డిసైడ్ చేయడానికి.. గర్వంతోనే గబ్బర్ సింగ్.. క్రిటిక్స్‌పై నోరుపారేసుకొన్నహరీశ్

నువ్వెవడివిరా డిసైడ్ చేయడానికి.. గర్వంతోనే గబ్బర్ సింగ్.. క్రిటిక్స్‌పై నోరుపారేసుకొన్నహరీశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్నది. డివైడ్ టాక్‌తో ప్రారంభమైన డీజే.. సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కును అధిగమించేందుకు డీజే చిత్రం పరుగులు పెడుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డీజే చిత్రంపై, అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్‌పై, పూజా హెగ్డే గ్లామర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇదే వేడుకలో ఇతర హీరోల ఫ్యాన్స్‌పై, సినీ విమర్శకులపై దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

వారంలో 100 కోట్ల దిశగా 'డిజె'... థాంక్స్ మీట్లో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోస్)


నువ్వెవెడివిరా డిసైడ్ చేయడానికి..

నువ్వెవెడివిరా డిసైడ్ చేయడానికి..

దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. మన విమర్శకులు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రివ్యూలు ఎలా ఉంటాయంటే.. డైరెక్టర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయి అంటారు. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి, అలా డిసైడ్ చేయడానికి నువ్వెవడ్రా అంటూ సినీ విమర్శకులపై చేసిన మాటలు వివాదాస్పదమయ్యాయి.


కథావస్తువును విమర్శించండి..

కథావస్తువును విమర్శించండి..

సినీ విమర్శకులను అలా వ్యాఖ్యలు చేస్తూనే మీరు కథా వస్తువును విమర్శించండి. అలా చేయడం ద్వారా మమల్ని మంచి సినిమాలు తీసేందుకు ప్రోత్సహించాలి. అలాంటి వ్యాఖ్యలు మాకు స్ఫూర్తిగా నిలుస్తాయంటూనే సినీ విమర్శకులపై మండిపడ్డారు. సినిమా నచ్చకపోతే ఇది బాగాలేదు. ఆ పాత్ర ఔచిత్యం ఇలా ఉంది అంటూ సలహాలు ఇవ్వాలి అని సూచించారు.


గర్వంతోనే గబ్బర్ సింగ్

గర్వంతోనే గబ్బర్ సింగ్

ఒక సినిమా హిట్ కాగానే నాకు కళ్లు నెత్తికి ఎక్కాయి. పొగరు అని కొందరు అంటుంటారు. రాస్తుంటారు. గబ్బర్ సింగ్ తర్వాత నీకు గర్వం (అటిట్యూట్) పెరిగిపోయింది అని నాతో అంటుంటారు. కానీ నాకు గర్వం ఉంది కాబట్టే గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీశాను. మీకు సినిమా నచ్చితే మీ రివ్యూ ఇవ్వండి.. అంతేకాని మరొకరి రివ్యూ చూసి మీరు ప్రభావితం కాకండి అంటూ క్రిటిక్స్‌ను ఉద్దేశించి హరీశ్ చులకనగా మాట్లాడారు.


గల్లీకి రా తేల్చుకుందాం..

గల్లీకి రా తేల్చుకుందాం..

నేను హీరో వర్షిప్‌తోనే పెరిగాను. ఇప్పటికీ హీరోలకు నేను అభిమానిని. ఆ రోజుల్లో అభిమానుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కొట్లాడుకోవడం, పోట్లాడుకోవడం చాలా సహజం. వివాదం కొంచెం ముదిరితే గ్రౌండ్‌కు రా చూసుకొందాం. మా గల్లీకి రా తేల్చుకుందా అని అనుకొనే వాళ్లం.


మనుషులకు ఎమోషన్స్ ఉండాలి..

మనుషులకు ఎమోషన్స్ ఉండాలి..

ఈ రోజు ఏమైందంటే.. సోషల్ మీడియాలోకి రా. మా వాళ్లు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో రెడీగా ఉన్నారు. అక్కడ చూసుకొందాం అని అన్నారు. టెక్నాలజీకి ఎమోషన్స్ ఉండవు. ఏది పోస్ట్ చేస్తే అది పోస్ట్ అవుతుంది. ఎమోషన్స్ మనుషులకు ఉండాలి. సినిమా రిలీజ్‌కు ముందు చాలా మంది విమర్శలు చేశారు. వారికి నేను సమాధానం ఇచ్చుకోను కానీ.. సంజాయిషీ ఇచ్చుకొంటాను. నా సినిమా సక్సెస్ రేంజ్ ఎంటో నేను చెప్పను.. ఎందుకంటే విమర్శకులకు సమాధానం బాక్సాఫీస్ చెప్పుతున్నది అని అన్నారు.


రెవెన్యూ కనపడాలి తప్ప.. రివ్యూలు ..

సినిమాపై టెలివిజన్ చానెల్లు, వెబ్‌సైట్లు రాసిన వ్యతిరేక రివ్యూలను డీజే అధిగమించింది. వాటిని పక్కన పెట్టి ప్రేక్షకులు డీజేను పెద్ద హిట్ చేశారు. ఈ సినిమా నాన్ బాహుబలి సినిమా రికార్డులను తుడిచిపెట్టేస్తున్నది. ఈ సినిమా టాలీవుడ్ టాప్ ఐదు చిత్రాల్లో ఎక్కడ ఉంటుందో కాలమానమే సమాధానం చెప్తుంది. మంచి వినోదాత్మక చిత్రాన్ని తీసినప్పుడు రెవెన్యూ కనపడాలి తప్ప.. రివ్యూలు కనిపించాల్సిన అవసరం లేదని నిరూపించిన చిత్రం దువ్వాడ జగన్నాథం అని హరీశ్ శంకర్ అన్నారు.English summary
DJ Director Harish Shankar made Derogatory comments on critics In DJ Thankyou meet which conducted JRC function hall of Hyderabad. He fired on critics who writes against the DJ. His comments now into controversial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu