»   » ఈ హీరోయిన్ ని మీరు గుర్తు పట్టగలరా? ఒకప్పుడు రవితేజతో చేసింది

ఈ హీరోయిన్ ని మీరు గుర్తు పట్టగలరా? ఒకప్పుడు రవితేజతో చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ క్రింద ఫొటోలో ఉన్న ఆమెను గుర్తు పట్టగలరా..పోనీ ఓ క్లూ ఆమె రవితేజ కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రంలో చేసింది. అయ్యో ఇప్పటికీ గుర్తు రాలేదా..ఎక్కడో చూసినట్లు ఉందా.. సర్లేండి..మీకు ఐడియా రావటం లేదు కదా..మేమే చెప్పేస్తున్నాం..ఆమె రక్షిత.

రవితేజ హీరోగా వచ్చిన 'ఇడియట్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కన్నడ భామ రక్షిత తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో పెళ్లాం ఊరెళితే, నిజం, శివమణి, లక్ష్మి నరసింహ, ఆంధ్రావాలా, అందరివాడు, జగపతి, అదిరిందయ్యా చంద్రం అనే చిత్రాల్లో నటించింది.

Do you remember this Ravi Teja's Heroine?

తాజాగా ఈ భామని చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు ఈమె రక్షిత నేనా ? అని సందేహపడుతున్నారు. సినిమాలు తగ్గడంతో 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను పెళ్లి చేసుకున్న ఈ భామ ఓ బాబుకు జన్మనిచ్చింది, ఆ తరువాత నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది,.. తాజాగా మరోసారి ప్రెగ్నెంట్ అయిన రక్షిత లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో కనిపించిన ఈమెను చూసి జనాలు షాక్ అయ్యారు

Do you remember this Ravi Teja's Heroine?

ఒకప్పుడు సెక్సీగా ఆకట్టుకునే రూపంతో ఉన్న రక్షిత పెళ్లయిన తర్వాత బొద్దుగా ...ఇలా మారి సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా కావాలని నిర్ణయించుకుంది. ఆ మధ్యన రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచనలో ఉందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది.

Do you remember this Ravi Teja's Heroine?

వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని వెల్లడించింది. జేడీఎస్ పార్టీ నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరేప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అని రక్షిత వెల్లడించడం గమనార్హం.

English summary
Rakshitha who acted with Ravi Tej in Idiat has gained some weight in due course of time. Fans couldn't recognise her immediately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu