»   » నాగ చైతన్య ‘దోచేయ్’ : చివరి 30 నిమిషాలు సూపర్

నాగ చైతన్య ‘దోచేయ్’ : చివరి 30 నిమిషాలు సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య నటించిన ‘దోచేయ్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య ఫాదర్ నాగార్జున ఈ చిత్రం స్పెషల్ షో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం నాగార్జున్ సినిమా బావుందంటూ టీంను ప్రశంసించారు.

సినిమా గురించి నాగార్జున వివరిస్తూ...‘దోచేయ్ స్పెషల్ షో చూసాను. చాలా ఎంటర్టెనింగ్ మూవీ. చివరి 30 నిమిషాలు చాలా బావుంది' అంటూ సినిమా యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని, చైతూ కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసారు.


Dochay Premier Show Talk

నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచెయ్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు.


ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Nagarjuna said , “watched Dochay last night, very slick and very entertaining. Last 30 minutes hilarious.” Apparently Nagarjuna signed off wishing All the best to the Dochay team.
Please Wait while comments are loading...