»   » సల్మాన్‌కు జైలు: రోడ్డుపై పడుకుంటే కుక్కలు కూడా చస్తాయంటూ ట్వీట్

సల్మాన్‌కు జైలు: రోడ్డుపై పడుకుంటే కుక్కలు కూడా చస్తాయంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫుట్ పాత్ మీద పడుకున్న ఒకరి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో బాలీవుడ్ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విషాదంలో మునిగి పోయారు. సల్మాన్ ఖాన్ కు మద్దతుగా ట్వీట్లు చేసారు.

ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, సల్మాన్ ఖాన్ మద్దతు దారుల్లో ఒకరైన అభిజీత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...రోడ్డు ఉన్నవి కార్లు మరియు కుక్కలు వెళ్లడానికే. మనుషులు పడుకోవడానికి కాదు. కుక్కలు రోడ్డుపై పడుకుంటే చస్తాయి. రోడ్లు ఉన్నది పేద వారి కోసం కాదు. నేను చాలా కాలం ఇళ్లు లేకుండా ఉన్నాను. అలా అని రోడ్లపై పడుకోలేదు అంటూ అభిజిత్ ట్వీట్ చేసారు.

 Dogs will die if they sleeps on the road: Abhijeet

రోడ్డు పక్కన పడుకోవాలనుకుంటే మీ విలేజికి వెళ్లి పడుకోండి...ఇలా ముంబై లాంటి నగరాలకు వచ్చి పడుకోవద్దు. ఇక్కడ ఫుట్ పాత్ లు కట్టింది అందుకోసం కాదు. సూసైడ్ అనేది నేరం. ఫుట్ పాత్ మీద పడుకోవడం కూడా ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే. సల్మాన్ ఖాన్ కు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా అభిజిత్ తన ట్విట్టర్ ద్వారా కోరాడు. సినిమా పరిశ్రమలో 80 శాతం మంది కనీసం ఇల్లు కూడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ వారెవరూ ఎప్పుడూ ఫుట్ పాత్ మీద పడుకోలేదు అని అభిజిత్ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి స్పందిస్తూ... నా తోటి కళాకారుడు దోషిగా తేలడంపై నాకూ చాలా బాధగా ఉంది. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. కావాలని చేసింది కాదు. ఆయనకు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కర్చితంగా ఆయనకు శిక్ష వేసే సమయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను. ఆయన నటిస్తున్న సినిమాలు పూర్తి చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష ఎక్కువ కాలం పడకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నటి హేమా మాలిని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో వైపు బాలీవుడ్ స్టార్లు సోనాక్షి సిన్హా, ప్రీతి జింతా ముంబైలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్టుమెంటుకు వెళ్లి బాదలో ఉన్న సల్మాన్ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు స్పందిస్తూ....సల్మాన్ ఖాన్ మంచి మనిషి అని, అతనికి అందరూ అండగా నిలవాలి అని కోరారు.

తన తల్లి ప్రాణాలు కాపాడిన మంచి మనిషి సల్మాన్ ఖాన్ అని, అతని మేలు ఉన్నటికీ మర్చిపోలేనని నటి దియా మీర్జా చెప్పుకొచ్చారు.

సల్మాన్ కు శిక్ష విధించారనే వార్త దిగ్బ్రాంతిని కలిగించిందని నటి సోనాక్షి సిన్హా వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ చాలా మంచి మనిషి, ఆయన ఎన్నో మంచి పనులు చేసారు. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆమె అన్నారు.

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడిందనే విషయం తెలియగానే గుండె ఆగినంత పని అయిందని నటుడు కునాల్ కోహ్లి చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్ దోషి అని ఎవరు చెప్పినా తన మద్దతు మాత్రం సల్మాన్ ఖాన్ కే ఉంటుందని నటుడు అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు.

మన వాళ్లెవరైనా తప్పు చేసినా శిక్ష పడితే బాధ పడతాం. సల్మాన్ ఖాన్ అంటే తమకు ఇస్టమని, తామంతా ఆయనకు మద్దతుగా ఉంటామని అలియా భట్ పేర్కొన్నారు. ఎంతో మందికి మంచి చేసిన సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష చాలా ఎక్కువ అన్నారు దర్శకురాలు ఫరా ఖాన్.

English summary
'Dogs will die if they sleeps on the road' says Playback singer Abhijeet is one such well-wisher of Salman.
Please Wait while comments are loading...