»   »  నాగ చైతన్యతో మధురిమ హాట్ హాట్ స్టెప్స్ (సాంగ్ టీజర్ 3)

నాగ చైతన్యతో మధురిమ హాట్ హాట్ స్టెప్స్ (సాంగ్ టీజర్ 3)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య కథానాయకుడిగా, కృతి సానన్ హీరోయిన్ గా.... ‘స్వామిరారా'ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచేయ్'. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 3న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ సాంగ్ టీజర్లను మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు రోజుకో పాటను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం(మార్చి 30) మరో టీజర్ విడుదలైంది. ‘ఆనాటి దేవదాసు' అంటూ సాగే ఈ పాటలో సెక్సీ బ్యూటీ మధురిమ హాట్ హాట్ స్పెప్పులేస్తూ అదరగొట్టింది. ఈ సాంగ్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి. ఏప్రిల్ 1 వరకు మొత్తం 4 పాటలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఏప్రిల్ 3న లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది.

Dohchay-Aanati Devadasu Song Teaser

ఏప్రిల్ 17న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. యువసామ్రాట్ నాగ చైతన్య సరసన కృతి సానన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కెచ్చా కంపక్డే, విజయ్, డాన్స్: జానీ, శేఖర్, ఆర్ట్: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, కథ-దర్శకత్వం: సుదీర్ వర్మ.

English summary
Watch Aanati Devadasu song teaser from Dohchay movie ft. Naga Chaitanya and Mahurima.
Please Wait while comments are loading...