»   »  ఉదయ్ కిరణ్ జీవితంలాగే...టైటానిక్ హీరోకు కూడా

ఉదయ్ కిరణ్ జీవితంలాగే...టైటానిక్ హీరోకు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: సినిమాలో నటించిన హీరోనే తను చేసింది ఓ చెత్త సినిమా అని, దాన్ని చూడవద్దని కోరటం అరుదు. అప్పట్లో ఉదయ్ కిరణ్ తన తొలి రోజుల్లో చేసిన జోడి నెంబర్ వన్ అనే చిత్రం ఆయన స్టార్ హీరో అయినప్పుడు రిలీజ్ చేసారు. ఆ సినిమాను ఆపు చేయాలని ఆయన ప్రయత్నం చేసారు కానీ ఫలించలేదు. ఇప్పుడు అలాంటిదే హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియా జీవితంలో జరుగుతోంది.

తాను అప్పట్లో అంటే 1996లో నటించిన ‘డాన్స్‌ ప్లమ్‌' చిత్రాన్ని దొరికినా చూడవద్దని ఆ హీరో కోరుతున్నాడు. 1995లోనే ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డేల్‌ వీట్లీ. దీన్ని ఈ మధ్యనే ఇంటర్నెట్‌లో ఫ్రీగా ప్రదర్శనపెట్టాడు.

Don's Plum: The film Leonardo DiCaprio never wants


ఆ చిత్రం ఏమాత్రం బాగలేదని, ప్రదర్శన యోగ్యంగా లేదని భావించిన లియోనార్డో, ఆయనతోబాటు చిత్రంలో నటించిన టోబే మెగ్త్వెర్‌లు ఇద్దరూ అప్పట్లోనే కోర్టుకు వెళ్లి, దాని విడుదలను నిలుపు చేయించారు.

ఇండిపెండెంట్‌ నిర్మాతగా తాను తీసిన చిత్రం గురించి ప్రచారం చేసుకోవడానికి తాను ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో ఉంచానని డేల్‌ చెప్తున్నా వినకుండా, లియోనార్డో, ఈసారి ఇంటర్నెట్‌ వారికి నోటీసులు ఇచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయించాడు. ఇంతకీ ఈ సినిమా టైటానిక్ చిత్రానికి ముందు చేసింది. ఆ తర్వాత లియోనార్డో పెద్ద హీరో అయిపోయాడు.

English summary
Don’s Plum, also known as the film Leonardo DiCaprio never wants you to see, has been removed from a free streaming site yet again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu