»   » జూ పవర్ స్టార్ అని పిలిస్తే బ్లాక్ చేస్తా: రేణు దేశాయ్ వార్నింగ్

జూ పవర్ స్టార్ అని పిలిస్తే బ్లాక్ చేస్తా: రేణు దేశాయ్ వార్నింగ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Renu Desai Warns Pawan kalyan Fans

  పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కొడుకైన అకీరా నందన్‌ను ముద్దుగా జూ పవర్ స్టార్ అని పిలించుకుంటారు. పవన్ కళ్యాణ్ సినీ వారసుడు అతడే అని, భవిష్యత్తులో ఆయన వారసత్వంతో తెలుగు సినిమాను ఏలుతాడని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అందుకే ఇప్పటి నుండే కుర్రోడికి జూ పవర్ స్టార్ అంటూ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన కుమారుడిని పవన్ అభిమానులు ఇలా పిలవడం రేణు దేశాయ్‌కు అస్సలు నచ్చడం లేదు. దీనిపై ఆమె ఘాటైన కామెంట్స్ చేశారు.

  జూ పవర్ స్టార్ అని పిలవొద్దంటూ వార్నింగ్

  జూ పవర్ స్టార్ అని పిలవొద్దంటూ వార్నింగ్

  తన కుమారుడు అకీరాను ఎవరైనా జూ పవర్ స్టార్ అంటూ పిలిస్తే ఊకుకునేది లేదని రేణు దేశాయ్ మండి పడ్డారు. అలా పిలిచిన వారిని సోసల్ మీడియా పేజీలో బ్లాక్ చేస్తానంటూ రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు.

  పవన్ కళ్యాణ్‌కు కూడా ఇష్టం లేదట

  జూనియర్‌ పవన్‌ కళ్యాణ్‌ అని పిలవడం అకీరాకు, వాడి నాన్నకు, వాడి అమ్మనైన నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు అలా అనడం ఆపండి అని రేణు దేశాయ్ సూచించారు.

  కొడకును చూసి మురిసిపోయిన రేణు

  కొడకును చూసి మురిసిపోయిన రేణు

  నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడు.... అంటూ తన కొడుకు ఫోటో పోస్టు చేసి మురిసిపోయింది రేణు దేశాయ్.

  ఫ్యాన్స్ అసంతృప్తి

  ఫ్యాన్స్ అసంతృప్తి

  అయితే రేణు దేశాయ్ అలా చెప్పడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ కొడుకును జూ పవర్ స్టార్ అని పిలవడంలో తప్పేంటని కొందరు ప్రశ్నించారు. అయితే కొందరు మాత్రం రేణు దేశాయ్ వాదనతో ఏకీభవిస్తూ ఇకపై అలా పిలవబోము అని తెలిపారు.

  English summary
  "My cutie pie looking like a serious character from some noir European cinema. He was searching for some game trivia on his laptop with such super oncentration. Anyone commenting jr power star will be deleted and blocked by my pr assistant. P.S- neither Akira, nor his father, nor his mother like him being called jr. Power star, so you guys should stop it too." Renu Desai tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more