»   » సునీల్ కి అందుకే వేషాలు ఇవ్వటం లేదు : త్రివిక్రమ్

సునీల్ కి అందుకే వేషాలు ఇవ్వటం లేదు : త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హీరో సునీల్ ఇద్దరూ చిన్న నాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇద్దరూ రూమ్ మేట్స్ గా ఉండేవారు. సునీల్ రచయితగా ఎదిగే క్రమంలోనూ సునీల్ కి తను రాసే స్క్రిప్టులలో మంచి పాత్రలు రాసి లిప్ట్ ఇచ్చాడు. కమిడియన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసాడు.

త్రివిక్రమ్ దర్శకుడుగా మారాక కూడా ఆయన చిత్రాలన్నిటిలోనూ కీలక పాత్రలు చేస్తూ వచ్చాడు. అయితే జులాయి, అత్తారింటికి దారేది చిత్రాల్లో మాత్రం సునీల్ కి స్ధానం కనపడలేదు. దాంతో మీడియావారు త్రివిక్రమ్ ని ఈ విషయమై పలకరించటం జరిగింది.


త్రివిక్రమ్ సమాధానమిస్తూ... " ఈ రోజు సునీల్ మంచి పొజీషన్ లో ఉన్నాడు. అతనో స్టార్. మర్యాదరామన్న, పూల రంగడు చిత్రాలలో హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో అతని చేత కామెడీ పాత్రలు చేయచటం పద్దతి కాదు. ఓ స్నేహితుడుగా అతని ఎదుగులను కోరుకునే వ్యక్తిని, ఎప్పుడు ఉన్నత స్ధానంలో ఉండాలని కోరుకుంటాను ,"అని వివరణ ఇచ్చారు.

ఇక 'అత్తారింటికి దారేది' సినిమా కేవలం ఇక్కడే కాదు.. అమెరికాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక అమెరికాలో అయితే మొదటి వారాంతంలోనే 9.53 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో వచ్చిన వసూళ్లలో సగం మొత్తం అమెరికాలో కూడా వచ్చిందని తేల్చారు. దాంతో ఇప్పటివరకు అమెరికాలో ఉన్న తెలుగు సినిమా రికార్డుల చరిత్రను 'అత్తారింటికి దారేది' తిరగరాసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వారాంతంలో టాప్ 15 సినిమాల్లో దీనిదే అగ్రస్థానమని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు.

English summary
Trivikram sadi.. "Today he is in good position. He is a star. After the super success of Maryada Ramanna and Poolarangadu as lead actor, it would not be fair on my part to bring him down to play comedian roles. As I friend, I will always wish him to rise to the upper position," he concluded.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu