»   »  "అది చెప్తే నా ఇళ్ళు తగలబెట్టేస్తారు"... అంటే తాను పాక్ కి సానుకూలం అన్నట్టే కదా

"అది చెప్తే నా ఇళ్ళు తగలబెట్టేస్తారు"... అంటే తాను పాక్ కి సానుకూలం అన్నట్టే కదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాకిస్తాన్ కళాకారులు నటించిన సినిమాలను ప్రదర్శించనివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్ఎస్) తెగేసి చెబుతుండడంతో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' చిక్కుల్లో పడింది. దీంతో దర్శకుడు కరణ్ జోహార్ ఓ మెట్టు దిగివచ్చి ఇకపై తన సినిమాలలో పాకిస్తాన్ నటులకు అవకాశం ఇవ్వబోనని చెబుతూ తన సినిమాపై వస్తున్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ప్రయత్నించారు. కానీ జోహార్ బుజ్జగింపులకు ఎమ్ఎన్ఎస్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పింది. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఏ దిల్ హై ముష్కిల్'ను ప్రదర్శించే సినిమాహాళ్ళన్నిటికీ భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

హైదరాబాద్ లోనూ అదే సమస్య వచ్చింది పాకిస్థాన్ నటీనటులు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ మూవీని తన నియోజకవర్గం పరిధిలోని థియేటర్లలో ప్రదర్శించబోనివ్వం అని హెచ్చరిస్తూ సంతోష్, స్వప్న థియేటర్ల యాజమాన్యాలకి హైదరాబాద్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజాసింగ్ లోథ్... ఏ దిల్ హై ముష్కిల్ మూవీలో పాక్ నటుడు ఫవద్ ఖాన్ నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. " భారత్‌పై నిత్యం దాడులకి పాల్పడుతూ, భారత సైనికుల ప్రాణాలని పొట్టనపెట్టుకునేందుకు కుట్రపన్నుతున్న పాకిస్థాన్‌కి చెందిన నటీనటులని బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది" అని ఏ దిల్ హై ముష్కిల్ మూవీ డైరెక్టర్ కరణ్ జోహర్‌ని ప్రశ్నించారు.

 Imran Khan

అయితే నిర్మాతలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం అభయమిచ్చారు., 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు ఆటంకాలు రాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడతానని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు ఢిల్లీలో ఆయన్ని కలిసిన అనంతరం భారత సినీ, టెలివిజన్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ చెప్పారు.

అయితే ఇదే వివాదం పై కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు తమ వ్యాఖ్యలను ఉపసమ్హరించుకుంటున్న నేపథ్యం లో 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదంపై తన అభిప్రాయాలను వెల్లడించలేనని బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తన అభిప్రాయాలను వెల్లడించి ప్రమాదాలు కొనితెచ్చుకోలేనని అన్నారు.,,'ఈ వివాదంపై నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. నేను గనక నా అభిప్రాయాలు వెల్లడిస్తే కొంతమంది మా ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నిస్తారని నాకు భయం. దాడులు చేస్తామన్న హెచ్చరికలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా అభిప్రాయాలను నాలోనే దాచుకుంటున్నాన'ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.,,కాగా, పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆమిర్‌ ఖాన్ నిరాకరించాడు. దీని గురించి ధియేటర్ల యజమానుల సంఘాన్నే అడగాలని అన్నాడు.

English summary
Imran Khan was asked to comment on the controversy. However, the actor refused to comment on it saying, “I don’t want to get beaten up or threatened, will keep my opinion to myself.” Well, Imran did say a lot with that statement
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu