»   » ప్రేమ వ్యవహారంపై నోరు విప్పిన తమన్నా(పిక్చర్స్)

ప్రేమ వ్యవహారంపై నోరు విప్పిన తమన్నా(పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ కాలంలో ప్రేమ వ్యవహారాలు వెరీ కామన్. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారు ఎవరో ఒకరితో రహస్యంగానో, బహిరంగంగానో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటారు. అయితే స్టార్ హీరోయిన్ తమన్నా మాత్రం 'ప్రేమ' అనే విషయానికి మాత్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

తమన్నా వ్యవహారం చూస్తుంటే....ముందు డబ్బు సంపాదించుకోవాలి, ఆ తర్వాతే ప్రేమాగీనా అనే విషయాల గురించి ఆలోచించాలి అన్నట్లు ఉంది. ఎప్పుడైనా? ఎవరితోనైనా ప్రేమలో పడ్డరా? అని మీడియా వారు ప్రశ్నిస్తే తనదైన రీతిలో వారికి కౌంటర్ ఇస్తోంది.

సినిమాలతో బిజీగా ఉన్నానని, ప్రేమించే సమయం కూడా లేదని అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక డబ్బు విషయంలో అమ్మడు చెబుతున్న విషయాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన విషయాలు చూడండి.

డబ్బు విషయంలో ఇలా...

డబ్బు విషయంలో ఇలా...


వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా సంపాదన బాగా పెరిగి పోయింది. డబ్బు ఉంది కదా అని విచ్ఛలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు తనకు లేదట. అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టి ఏది పడితే అది కొనదట. తనకు కవాల్సిన, అవసరమైనవి మాత్రమే స్వయంగా ఏరికోరి జాగ్రత్తగా కొనుక్కుంటుందట.

కష్టాన్నే నమ్ముకుందట

కష్టాన్నే నమ్ముకుందట


సినీ పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. కష్టాన్ని నమ్ముకుని వచ్చాను. టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగాను. ఓ పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. దర్శకులు నా నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారో వీలైనంత వరకు కష్ట పడతాను అంటోంది.

ఎలాంటి భర్త కావాలి?

ఎలాంటి భర్త కావాలి?


సాధారణంగా ఏ అమ్మాయికైనా ఎలాంటి భర్త కావాలో కొన్ని ఊహలు, కోరికలు ఉంటాయి. అయితే తమన్నా మాత్రం తనకు ఇలాంటి భర్తే కావాలని ఎప్పుడూ ఊహించుకోలేదట. ప్రేమయినా, పెళ్లయినా సమయం వచ్చినపుడు జరుగుతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించను అంటోంది తమన్నా.

ఏయే సినిమాల్లో చేస్తోంది

ఏయే సినిమాల్లో చేస్తోంది


తెలుగులో తమన్నా నటించిన చివరి సినిమా ‘తడాఖా'. ఈచిత్రం తర్వాత మన్నా తెలుగులో మహేష్ బాబు సరసన ‘ఆగడు' చిత్రానికి ఎంపికయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, హిందీలో రెండు సినిమాలకు కమిటైంది.

తమన్నాను అడ్డుకున్న సమైక్య వాదులు

తమన్నాను అడ్డుకున్న సమైక్య వాదులు


ఇటీవల తమన్నా తిరుపతి వెళ్లగా అక్కడ సమైక్య వాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అనాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. తనకు అన్నిప్రాంతాల వారూ ఒక్కటే అని, ఎవరికీ మద్దతుగా మాట్లాడలేనని స్పష్టం చేసిన తమన్నా జై ఇండియా అంటూ నినాదాలు చేసారు.

English summary

 Dont have any time to love, says Tamanna. Tamanna is an Indian film actress. In 2005, she made her acting debut in the Bollywood film, Chand Sa Roshan Chehra, before working in the major South Indian film industries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu